బిజినెస్

ఎఫ్‌పిఐలకు ‘అసోం’ జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 22: విదేశీ మదుపరులు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఈ నెలలో ఇప్పటిదాకా దాదాపు 1,800 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. ఈ ఏడాది తొలి రెండు నెలల్లోనూ పెట్టుబడుల ఉపసంహరణల ధ్యాసతోనే నడిచిన విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ).. మలి రెండు నెలల్లో మాత్రం పెట్టుబడుల ప్రవాహాన్ని సృష్టించారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో స్టాక్ మార్కెట్లలోకి 29,558 కోట్ల రూపాయల పెట్టుబడులను ఎఫ్‌పిఐలు పట్టుకొచ్చారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న అంచనాలు మదుపరులను విపరీతంగా ఆకట్టుకోగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఏప్రిల్‌లో జరిపిన తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపో రేటును ఐదేళ్ల కనిష్టానికి తగ్గిస్తూ 6.5 శాతానికి తీసుకురావడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. ఈ నెలలోనూ పెట్టుబడుల దిశగానే వెళ్తున్నారు. నిజానికి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు, మారిషస్‌తో భారత పన్ను ఒప్పందాల సవరణ వంటివి తొలి రెండు వారాల్లో విదేశీ మదుపరుల కొనుగోళ్ల ఆసక్తిని దెబ్బతీశాయ. దీంతో స్టాక్ మార్కెట్ల నుంచి ఆ రెండు వారాల్లో 178 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు తరలిపోయాయ. అయతే గత వారం తిరిగి పుంజుకున్నాయ. అసోంలో బిజెపి అధికారంలోకి రావడమే కారణం. దీంతో మే నెలలో 1,795 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు భారత స్టాక్ మార్కెట్లకు వచ్చాయ. మరోవైపు ఇదే సమయంలో రుణ మార్కెట్ల నుంచి 3,496 కోట్ల రూపాయల విలువైన విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. ఇక జనవరి, ఫిబ్రవరి నెలల్లో 16,647 కోట్ల రూపాయల పెట్టుబడులను భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి ఎఫ్‌పిఐలు గుంజేసుకున్నారు. నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యనైతే ఏకంగా 41,661 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. మరోవైపు ఈ ఏడాది మొదలు ఇప్పటి దాకా స్టాక్ మార్కెట్లలోకి 14,706 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు రాగా, రుణ మార్కెట్ల నుంచి 4,436 కోట్ల రూపాయల పెట్టుబడుల తరలిపోయాయ. దీంతో ఈ ఏడాది నికర విదేశీ పెట్టుబడుల విలువ 10,270 కోట్ల రూపాయలుగా ఉంది.