బిజినెస్

ఆర్థిక ఫలితాలపై ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 22: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ, బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా తదితర బ్లూచిప్ సంస్థల త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్ సరళిని నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వర్ష సమాచారం కూడా మార్కెట్ పోకడను ప్రభావితం చేయగలదని చెబుతున్నారు. అయితే గురువారంతో ఈ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగియనుండటంతో సూచీలు ఒడిదుడుకులకు లోనుకావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ మదుపరుల పెట్టుబడులు కూడా స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను శాసించనున్నాయి. ‘వర్షాల ప్రగతికి సంబంధించిన సమాచారం, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల తీరు, ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలపై ఈ వారం స్టాక్ మార్కెట్ల కదలికలు ఆధారపడి ఉంటాయి.’ అని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అన్నారు. ఇక గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చికిగాను ఆర్థిక ఫలితాలను ఈ వారం బిపిసిఎల్, టాటా పవర్, సిప్లా, టెక్ మహీంద్ర, బజాజ్ ఆటో, గెయిల్, టాటా స్టీల్, ఎల్‌అండ్‌టి, బిహెచ్‌ఇఎల్, ఎస్‌బిఐ, కోల్ ఇండియా తదితర సంస్థలు ప్రకటిస్తున్నాయి. దీంతో వీటి ఆధారంగా మదుపరులు తమ పెట్టుబడులపై ఓ నిర్ణయానికి రావచ్చని మార్కెట్ విశే్లషకులు పేర్కొంటున్నా రు. ముఖ్యంగా ఇప్పటివరకు ప్రభుత్వరంగ బ్యాం కులన్నీ మొండి బకాయిల కారణంగా పేలవమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించిన నేపథ్యంలో ఎస్‌బిఐ ఫలితాల కోసం మదుపరులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారని రిలయన్స్ సెక్యూరిటీస్ ఓ ప్రకటనలో వ్యాఖ్యానించింది. ఇక గత రెండేళ్లు వర్షాలు ఆశించిన స్థాయిలో పడకపోవడంతో ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న అంచనాల మధ్య వర్ష సమాచారమూ మార్కెట్లను అమితంగా ప్రభావితం చేస్తోందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సిఎండి మోతీలాల్ ఓస్వాల్ అన్నారు. గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 187.67 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 65.20 పాయింట్లు నష్టపోయినది తెలిసిందే.