బిజినెస్

విశాఖ పెట్రోలియం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 27: విశాఖపట్నం పెట్రోలియం యూనివర్సిటి (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జి) వెబ్ సైట్‌ను ఢిల్లీలో శుక్రవారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆవిష్కరించారు. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఈ యూనివర్సిటిని కేంద్రం విశాఖపట్నంలో ఏర్పాటు చేసింది. కాగా, యూనివర్సిటి నిర్వహణను ఐఐటి ఖరగ్‌పూర్ వ్యవహరించనుంది. ఏపీ ప్రభుత్వం యూనివర్సిటి కోసం విశాఖ జిల్లాలో 150 ఎకరాలను ఇప్పటికే కేటాయించింది. ఈ యూనివర్సిటికి శాశ్వత ప్రాంగణం ఏర్పాటు చేసుకునే వరకు ఆంధ్రా యూనివర్సిటి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో వచ్చిన మార్కుల అధారంగా ఈ యూనివర్సిటిలో అడ్మిషన్లు జరుగుతాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో కృష్ణా, గోదవరి బేసిన్‌ను పెట్రోలియం హబ్‌గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్ గ్రీన్ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా మంత్రి చెప్పారు.