బిజినెస్

కెనరా బ్యాంక్ నష్టం రూ. 3,905 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 27: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్ స్టాండలోన్ నికర నష్టం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో 3,905.49 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చిలో 612.96 కోట్ల రూపాయల లాభాన్ని అందుకుంది. పెరిగిన మొండి బకాయిలే ఈ నష్టాలకు కారణమని శుక్రవారం బ్యాంక్ తెలిపింది. కాగా, దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ చరిత్రలో కేవలం ఒక త్రైమాసికంలో ఈ స్థాయి నష్టాలను నమోదు కావడం ఇది రెండోది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తర్వాత కెనరా బ్యాంక్ నష్టాలే అధికంగా ఉన్నాయి. ఇదిలావుంటే ఆదాయం విషయానికొస్తే ఈసారి 12,116.14 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 12,429.21 కోట్ల రూపాయలుగా ఉంది. మొండి బకాయిలు నిరుడు జనవరి-మార్చి నాటికి 13,039.96 కోట్ల రూపాయలుగా ఉంటే, ఈసారి మార్చికల్లా 31,637.83 కోట్ల రూపాయలకు చేరాయి. ఇక గత ఆర్థిక సంవత్సరం మొత్తంగా బ్యాంక్ నష్టం 2,812.82 కోట్ల రూపాయలుగా ఉంటే, అంతకుముందు ఆర్థిక సంవత్సరం బ్యాంక్ లాభం 2,702.63 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం 48,300.29 కోట్ల రూపాయల నుంచి 48,897.36 కోట్ల రూపాయలకు చేరింది.

జనవరి-మార్చిలో
ప్రభుత్వ బ్యాంకుల నష్టాలు

పంజాబ్ నేషనల్ బ్యాంక్
బ్యాంక్ ఆఫ్ ఇండియా
బ్యాంక్ ఆఫ్ బరోడా
సిండికేట్ బ్యాంక్
ఐడిబిఐ బ్యాంక్
యూకో బ్యాంక్
సెంట్రల్ బ్యాంక్
అలహాబాద్ బ్యాంక్
కార్పొరేషన్ బ్యాంక్
దేనా బ్యాంక్

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

5,367 కోట్లు
3,587 కోట్లు
3,230 కోట్లు
2,158 కోట్లు
1,736 కోట్లు
1,715 కోట్లు
898 కోట్లు
581 కోట్లు
511 కోట్లు
326 కోట్లు
120 కోట్లు