బిజినెస్

తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్‌లో పెట్టుబడులు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు పలు ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలతో శుక్రవారం సమావేశం అయ్యారు. మిన్నసోటాలో వైద్య పరికరాలు, పైపులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. అంతర్గత పైప్‌లైన్ల లీకేజీని అరికట్టేందుకు తమ కంపెనీ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని 3 ఎం కంపెనీ ఎగ్జిక్యూటివ్ జాన్ పోర్‌నూర్ కెటిఆర్‌కు వివరించారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్‌లో ఈ విధానం అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కెటిఆర్ మున్సిపల్ అధికారులకు తెలిపారు. టి-హబ్ గురించి అక్కడి పెట్టుబడిదారులకు కెటిఆర్ వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. హైదరాబాద్‌లోని వౌలిక వసతుల గురించి వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో తెలంగాణలో అపారమైన అవకాశాలు ఉన్నాయని పెట్టుబడులతో ముందుకు రావాలని కోరారు.

అమెరికన్ సంస్థల అధిపతులతో తెలంగాణ మంత్రి కెటిఆర్ బృందం