బిజినెస్

ఎస్‌బిఐ లాభానికి ఎన్‌పిఎ సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా/న్యూఢిల్లీ, మే 27: దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో 66 శాతం క్షీణించి 1,263.81 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చిలో ఈ లాభం 3,742.02 కోట్లుగా నమోదైంది. ఆదాయం ఈసారి 53,526.97 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 48,616.41 కోట్ల రూపాయలుగా ఉందని శుక్రవారం ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలియజేశారు. ఇక ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న మొండి బకాయిలు (ఎన్‌పిఎ) ఈ జనవరి-మార్చిలో 12,139.17 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు చెప్పారు. నిరుడు జనవరి-మార్చిలో 4,985.83 కోట్ల రూపాయలుగానే ఉన్నాయన్నారు. ఇక మొత్తం గత ఆర్థిక సంవత్సరం బ్యాంక్ లాభం 24 శాతం పడిపోయి 9,950.65 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇది 13,101.57 కోట్ల రూపాయలుగా ఉంది. అయితే ఆదాయం 2015-16లో 1,91,843.67 కోట్ల రూపాయలుగా, 2014-15లో 1,74,972.96 కోట్ల రూపాయలుగా ఉంది. అయినప్పటికీ ఇచ్చిన రుణాల్లో నిరర్థక ఆస్తుల క్రిందికి అధిక శాతం వెళ్లడం బ్యాంక్ లాభాలకు గండి కొట్టింది. మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పిఎ) 2014-15తో పోల్చితే 2015-16లో 4.25 శాతం నుంచి 6.5 శాతానికి పెరిగాయి. గణాంకాల్లో చెప్పాలంటే 56,725.34 కోట్ల రూపాయల నుంచి 98,172.80 కోట్ల రూపాయలకు పెరిగాయి. అంటే గత ఆర్థిక సంవత్సరం 40,000 కోట్ల రూపాయలకుపైగా మొండి బకాయిలు పెరిగాయన్నమాట.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
మరో ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం గత ఆర్థిక సంవత్సరం 23 శాతం దిగజారి 1,356.44 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 1,760.52 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం 2015-16లో 36,250.10 కోట్ల రూపాయలుగా ఉంటే, 2014-15లో 36,121.40 కోట్ల రూపాయలుగా ఉంది. మొండి బకాయిలు 4.96 శాతం నుంచి 8.70 శాతానికి చేరాయి.
ఎస్‌ఐడిబిఐ
ప్రభుత్వరంగ చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (ఎస్‌ఐడిబిఐ) నికర లాభం కూడా 17 శాతం పడిపోయి గత ఆర్థిక సంవత్సరం 1,177 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 1,417 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. స్థూల ఆదాయం మాత్రం స్వల్పంగా 5,741 కోట్ల రూపాయల నుంచి 5,784 కోట్ల రూపాయలకు పెరిగింది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏకీకృత నష్టం 2015-16లో 1,396.37 కోట్ల రూపాయలుగా నమోదైంది. 2014-15లో 666.06 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. పెరిగిన మొండి బకాయిలే నష్టాలకు కారణం. ఆదాయం కూడా అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే గత ఆర్థిక సంవత్సరం 28,376.37 కోట్ల రూపాయల నుంచి 27,932.13 కోట్ల రూపాయలకు తగ్గింది.
chitram..
విలేఖరులతో మాట్లాడుతున్న భట్టాచార్య