బిజినెస్

ఖరీదైన డైరెక్టర్.. పవన్ ముంజల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 25: దేశీయ ఆటోరంగ దిగ్గజం, ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ప్రమోటర్ పవన్ ముంజల్.. ప్రైవేట్ సంస్థల డైరెక్టర్లలో అత్యధిక వేతనాన్ని పొందుతున్న డైరెక్టర్‌గా నిలిచారు. గత ఆర్థిక సంవత్సరం (2014-15)లో 43.91 కోట్ల రూపాయలను ఈయన వేతనంగా అందుకున్నారు. ఈయన తర్వాత ఉన్న ఇద్దరు డైరెక్టర్లు కూడా హీరో మోటోకార్ప్‌నకు చెందినవారే కావడం గమనార్హం. వారిరువురిలో ఒకరు ఇటీవలే మరణించిన బ్రిజ్‌మోహన్ లాల్ ముంజల్ కాగా, మరొకరు సునీల్ కాంత్ ముంజల్. వీరిద్దరూ 2014-15లో అత్యధిక పారితోషికం తీసుకున్న డైరెక్టర్లలో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. బ్రిజ్‌మోహన్ లాల్ ముంజల్ 43.64 కోట్ల రూపాయలను తీసుకుంటే, సునీల్ కాంత్ ముంజల్ 41.87 కోట్ల రూపాయలను పొందారు. ఈ ముగ్గురి తర్వాత లుపిన్ చైర్మన్ దేశ్‌బంధు గుప్తా (రూ. 37.58 కోట్లు), లార్సెన్ అండ్ టర్బో చైర్మన్ ఎఎమ్ నాయక్ (రూ. 27.32 కోట్లు) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఈ మేరకు ప్రోక్సీ అడ్వైజరీ సంస్థ ఇన్‌గవర్న్ నివేదిక చెబుతోంది. కాగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీలో లిస్టయిన సంస్థల్లోని 95 మంది డైరెక్టర్ల వార్షిక వేతనం సగటున 9 కోట్ల రూపాయలుగా ఉండటం విశేషం. అంతేగాక ఈ జాబితాలో టాప్-10లో ఉన్నవారందరి వార్షిక వేతనం 19 కోట్ల రూపాయల పైమాటే. టాప్-10లో నిలిచిన తర్వాతి ఐదుగురిలో భారతీ ఎయిర్‌టెల్ అధినేత సునీల్ భారతీ మిట్టల్ (రూ. 27.18 కోట్లు), లుపిన్ సిఇఒ వినితా గుప్తా (రూ. 24.86 కోట్లు), హిందాల్కో ఎండి డి భట్టాచార్య (రూ. 21.59 కోట్లు), టిసిఎస్ ఎండి ఎన్ చంద్రశేఖరన్ (రూ. 21.28 కోట్లు), ఆదిత్యా బిర్లా గ్రూప్ అధిపతి కుమార మంగళమ్ బిర్లా (రూ. 19.04 కోట్లు) వరుసగా 6-10 స్థానాల్లో ఉన్నారు. టాప్-10లో నిలిచిన ఏడుగురు డైరెక్టర్లు ఆయా సంస్థల ప్రమోటర్లే కావడం గమనార్హం. అంతేగాక ఎనిమిది మంది డైరెక్టర్ల వార్షిక వేతనం ఆయా సంస్థల స్టాండలోన్ నికర లాభంలో ఒక శాతానికంటే ఎక్కువగా ఉండటం విశేషం.
ఇక మొత్తం ఈ జాబితాలో 11 మంది డైరెక్టర్ల వేతనం సంస్థల్లోని సగటు ఉద్యోగి వేతనం కంటే 400 రెట్లు అధికంగా ఉంది. ఈ 11 మందిలో లుపిన్, హీరో మోటోకార్ప్‌లకు చెందినవారు ముగ్గురేసి ఉండగా, హిందాల్కో, ఎల్‌అండ్‌టి, సిప్లా, ఐటిసి, టిసిఎస్ సంస్థలకు చెందినవారు ఒక్కొక్కరున్నారు. కాగా, గత ఆర్థిక సంవత్సరం కోటి రూపాయల కంటే తక్కువగా వార్షిక వేతనం పొందిన ప్రముఖ సంస్థల డైరెక్టర్లలో ముగ్గురున్నారు. వారు లుపిన్ డైరెక్టర్ ఎండి గుప్తా (రూ. 50 లక్షలు), యాక్సిస్ బ్యాంక్ డైరెక్టర్ సంజీవ్ కె గుప్తా (రూ. 84 లక్షలు), సన్ ఫార్మా డైరెక్టర్ శైలేష్ టి దేశాయ్ (రూ. 93 లక్షలు) ఉన్నారు.