బిజినెస్

రూ. 4,460 కోట్లు ఢమాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 3: మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా తయారైంది బ్యాంకర్ల పరిస్థితి. ఇప్పటికే విజయ్ మాల్యా వంటి బడా కార్పొరేట్ల మొండి బకాయిలతో తలబొప్పి కట్టించుకున్న బ్యాంకులకు ఇప్పుడు జేపీ గ్రూప్ సంస్థలు మరింత తలపోటులా మారాయి. 4,460 కోట్ల రూపాయల రుణాలు, చెల్లింపులపై ఈ సంస్థలు విఫలమయ్యాయి మరి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల విలువ 2,905.6 కోట్ల రూపాయలుగా ఉంటే, ఇతరత్రా వడ్డీ చెల్లింపులు 1,558.93 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి జయప్రకాశ్ అసోసియేట్స్ రుణం 2,183.17 కోట్ల రూపాయలుగా, జయప్రకాశ్ పవర్ వెంచర్స్ రుణం 688.48 కోట్ల రూపాయలుగా, జేపీ సిమెంట్ రుణం 33.95 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. వీటిపై వడ్డీ బకాయిలు జయప్రకాశ్ అసోసియేట్స్‌కు 837.45 కోట్ల రూపాయలుగా, జయప్రకాశ్ పవర్ వెంచర్స్‌కు 152.18 కోట్ల రూపాయలుగా, జేపీ సిమెంట్ కార్పొరేషన్‌కు 63.13 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ఇవేగాక జేపీ గ్రూప్‌లోని ప్రగ్యరాజ్ పవర్ జనరేషన్ లిమిటెడ్‌పై వడ్డీ భారం 308.66 కోట్ల రూపాయలుగా, జేపీ ఇన్‌ఫ్రాటెక్‌పై 193.08 కోట్ల రూపాయలుగా, జేపీ ఆగ్రా వికాస్ లిమిటెడ్‌పై 3.01 కోట్ల రూపాయలుగా ఉంది. మరో 75 లక్షల రూపాయలు మధ్యప్రదేశ్ జేపీ మినరల్స్ లిమిటెడ్‌పై 67 లక్షల రూపాయలు భిలాయ్ జేపీ సిమెంట్‌పై వడ్డీ భారం ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో జేపీ గ్రూప్‌లోని బడా సంస్థ అయిన జయప్రకాశ్ అసోసియేట్స్ ఏకీకృత నష్టాలు 3,345 కోట్ల రూపాయలకు పెరిగాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) ఈ నష్టాలు 1,735.10 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ఈ విపత్కర పరిణామాల మధ్య కుమారమంగళమ్ బిర్లా నేతృత్వంలోని అల్ట్రాటెక్‌కు తమ సిమెంట్ వ్యాపారాన్ని అమ్మేస్తున్నట్లు జేపీ గ్రూప్ ఇప్పటికే ప్రకటించినది తెలిసిందే.