బిజినెస్

ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల్లో అరుంధతీ భట్టాచార్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 7: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య.. ఆర్థిక రంగంలో ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన జాబితాలో అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఐదో స్థానంలో నిలిచారు. నిరుడుతో పోల్చితే ఈసారి భట్టాచార్య ఐదు స్థానాలు ఎగబాకడం గమనార్హం. ఇక ప్రపంచంలో వంద మంది అత్యంత శక్తిమంతమైన మహిళల్లో భట్టాచార్య ఐదో స్థానంలో ఉన్నారని ఓ ప్రకటనలో మంగళవారం ఎస్‌బిఐ చెప్పింది. ఈ జాబితాలో రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక, శాస్త్ర, పెట్టుబడుల, దాతృత్వ విభాగాలకు చెందిన మహిళలున్నారు. సిఇఒలు కూడా ఉన్నారు. 200 ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన ఎస్‌బిఐకి సారథిగా ఉన్న భట్టాచార్య.. ఎస్‌బిఐఇన్‌టచ్ డిజిటల్ బ్యాంకింగ్ ఔట్‌లెట్, మొబైల్ వాలెట్ స్టేట్ బ్యాంక్ బడ్డీ కార్యక్రమాలతో ఎస్‌బిఐని టెక్నాలజీ బాట పట్టించారు. భట్టాచార్య నేతృత్వంలో ప్రస్తుతం ఎస్‌బిఐ కార్యకలాపాలు 36 దేశాల్లో నడుస్తుండగా, దాదాపు 17 వేల శాఖలలో 330 మిలియన్లకుపైగా కస్టమర్లు బ్యాంకింగ్ సేవలను అందుకుంటున్నారు.

వర్షంతో ఓపెన్ కాస్ట్ గనుల్లో
బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
గోదావరిఖని, జూన్ 7: సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌లలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రామగుండం రీజియన్‌లోని ఓపెన్ కాస్ట్-1, 2, 3, మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌లలో బొగ్గు ఉత్పత్తి అనుకున్న మేరకు తీయలేకపోయారు. రామగుండం రీజియన్‌లోని ఓపెన్ కాస్ట్-3లోనైతే సుమారు 13 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి వెలికి తీయకుండా ఆటంకం కలిగింది. ఓసిపి-2లో 4 వేల టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలగగా, మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్-4లో కూడా ఓవర్ బర్డెన్ మట్టి వెలికితీతకు వర్షం అడ్డంకిగా నిలిచింది. బొగ్గు వెలికితీత కూడా సుమారుగా 5 వేల టన్నుల వరకు ఆగినట్లు అధికారుల ద్వారా తెలిసింది. ప్రాజెక్ట్-1లో ఓవర్ బర్డెన్ మట్టి వెలికితీతకు తీవ్ర అంతరాయం ఏర్పడగా బొగ్గు ఉత్పత్తి విషయంలో కూడా కొన్ని గంటల పాటు అంతరాయం కలగగా తరువాత ఉత్పత్తిని యథావిధిగా సాధిస్తూ లక్ష్యానికి చేరువలో పనిచేశారు.
సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌ల్లోకి కార్మికులు వెళ్లలేకపోయారు. బురద కారణంగా భారీ వాహనాలేవీ కూడా లోనికి వెళ్లలేని పరిస్థితి ఎదురైంది.

హైదరాబాద్‌లో విఎల్‌ఎస్‌ఐడి అకాడమీ’
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 7: దేశంలో అతిపెద్ద ఇంక్యుబెటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పిన తెలంగాణ ప్రభుత్వం.. త్వరలో విఎల్‌ఎస్‌ఐడి (వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ డిజైన్) అకాడమీ ఏర్పాటు చేయబోతున్నట్టు రాష్ట్ర ఐటిశాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. ఐటి మంత్రి కెటిఆర్‌తోపాటు అమెరికా పర్యటనకు వెళ్లిన జయేశ్ రంజన్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ టి హబ్‌లో హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ల పరిశ్రమలు వస్తున్నాయన్నారు. విఎల్‌ఎస్‌ఐడి అకాడమీ దేశంలోనే మొదటిదని చెప్పారు.

హైదరాబాద్‌లో సేల్స్‌ఫోర్స్ సెంటర్
న్యూఢిల్లీ, జూన్ 7: సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం సేల్స్‌ఫోర్స్.. 2020 నాటికి హైదరాబాద్‌లో వెయ్యికిపైగా ఉద్యోగులను పెంచుకోవాలని భావిస్తోంది. తద్వారా ఈ ప్రాంతంలో టెక్నాలజీపరంగా నైపుణ్యం కలిగిన యువతను అందిపుచ్చుకోవాలని చూస్తోంది. దేశీయంగా విస్తరణ ప్రణాళికలో భాగంగా హైదరాబాద్‌లో ఓ నూతన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను కూడా సంస్థ ఏర్పాటు చేయనుంది. ఈ ఏడాది ఆఖర్లో ఆ పనులు మొదలవుతాయి. సంస్థ టెక్నాలజీ, ప్రోడక్ట్స్ వృద్ధిలో ఇది కీలకంగా మారుతుందని సేల్స్‌ఫోర్స్ చెబుతోంది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.