బిజినెస్

27 వేల స్థాయికి సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 7: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 7 నెలల తర్వాత తిరిగి 27 వేల స్థాయిని తాకింది. 232.22 పాయింట్లు ఎగిసి 27,009.67 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 65.40 పాయింట్లు ఎగిసి 8,266.45 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు కూడా మదుపరులను కొనుగోళ్ల వైపు నడిపించాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 66.77 శాతానికి కోలుకోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచింది. మంగళవారం ఆర్‌బిఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లు యథాతథంగా ఉన్నప్పటికీ మదుపరులు లెక్కచేయలేదు. ఇక ఆసియా మార్కెట్లలో జపాన్, చైనా, హాంకాంగ్ సూచీలు లాభాల్లో ముగియగా, ఐరోపా మార్కెట్లలోనూ ప్రధాన సూచీలు లాభాల్లోనే కదలాడాయి.