బిజినెస్

తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 8: తెలంగాణ రాష్ట్భ్రావృద్ధికి దక్షిణ కొరియా అన్ని రకాలుగా సహకరిస్తుందని భారత్‌లో కొరియా రాయబారి చో హ్యూన్ స్పష్టం చేశారు. బుధవారం ఇక్కడ పారిశ్రామిక సంఘం సిఐఐ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ, కొరియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సుకు కొరియాకు చెందిన 50 మంది వాణిజ్య ప్రతినిధులు హాజరై తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ఇక్కడ అమలవుతున్న పారిశ్రామిక విధానాలను తెలుసుకుని ముగ్ధులయ్యారు. పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా, కొరియా ట్రేడ్ ఇనె్వస్ట్‌మెంట్ ప్రమోషన్ ఏజన్సీ (కెఒటిఆర్‌ఎ), తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక వౌలికాభివృద్ధి సంస్థ (టిఎస్‌ఐఐసి) మధ్య వాణిజ్య బంధాలు బలపడేలా అవగాహన ఒప్పందం (ఎంఒయు) కుదిరింది. దీనిపై ఇరు సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్, అర్బ న్ ఇండస్ట్రీ, వ్యవసాయం, ఫార్మా, జీవశాస్త్రం ఏరోస్పేస్, రక్ష ణ, నైపుణ్య అభివృద్ధి రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా కొరియా బృందం తెలిపింది. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, క్లీన్ ఇండియా, డిజిటల్ ఇండియాకు సహకరిస్తామని కొరియా బృందం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు బివి పాపారావు మాట్లాడుతూ విద్యుత్, వౌలిక, ఐటి రంగాల్లో చేపట్టిన అభివృద్ధిని వివరించారు. సిఐఐ తెలంగాణ చైర్మన్ నృపేంద్రరావు, పరిశ్రమల కార్యదర్శి అరవింద్ కుమార్, పర్యాటక రంగం కార్యదర్శి బి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటున్న కెఒటిఆర్‌ఎ, టిఎస్‌ఐఐసి ప్రతినిధులు