బిజినెస్

వృద్ధికి పెట్టుబడులే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 8: వేగవంతమైన వృద్ధికి ప్రైవేట్‌రంగ పెట్టుబడులు చాలా అవసరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. వేగవంతమైన వృద్ధిని అందుకునే సామర్థ్యం భారత్‌కుందన్న ఆయన వాస్తవ జిడిపి గణాంకాలు ఒక శాతం ఎక్కువగానో, తక్కువగానో ఉండొచ్చన్నారు. గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో భారత జిడిపి వృద్ధిరేటు 7.6 శాతంగా నమోదైనట్లు ఇటీవల ప్రకటించినది తెలిసిందే. ప్రపంచంలోని ప్రధాన దేశాల్లో ఇదే అత్యధికమని కూడా కేంద్రం చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకోగా, వివిధ టెలివిజన్ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక తన పదవీకాలంపై వస్తున్న ఊహాగానాలపై స్పందించేందుకు రాజన్ నిరాకరించారు. సెప్టెంబర్ 4 వరకు తన పదవీకాలం ఉందని, కాబట్టి ఈ లోగా ఏదో ఓ నిర్ణయమైతే వస్తుంది కదా అన్నారు. అయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో తనకు మంచి సంబంధాలే ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తున్న సహకారంపట్లా ప్రశంసలు కురిపించారు. కాగా, బిజెపి ఎంపి సుబ్రమణ్యన్ స్వామి వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన చేసిన ఆరోపణలు నిరాధారమైనవన్నారు. తగినవిధంగానే వాటికి సమాధానమిస్తానన్నారు. ఆర్‌బిఐ పాలసీపై వాస్తవిక దృక్పథంతో వచ్చే విమర్శలను స్వాగతిస్తానన్న ఆయన తన చిరకాల కోరిక మాత్రం బోధనేనని, పరిశోధనలు, ఆలోచనలకే పెద్దపీట వేస్తానన్నారు.