బిజినెస్

సిఇఒ పదవికి ఒసాము సుజుకి దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, జూన్ 8: జపాన్ చిన్న కార్ల తయారీ దిగ్గజం.. సుజుకి మోటార్ కార్పొరేషన్‌లో తప్పుడు మైలేజీ టెస్టింగ్ తీవ్ర ప్రకంపనలకే దారి తీసింది. ఈ వివాదంతో సిఇఒ పదవిని ఒసాము సుజుకి వదులుకున్నారు. ‘తప్పుడు మైలేజీ టెస్టింగ్ పద్ధతుల వివాదం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.’ అని బుధవారం ఇక్కడ ఓ ప్రకటనలో సంస్థ తెలియజేసింది. ఈ వివాదం తదనంతర పరిణామాల మధ్య సంస్థ డైరెక్టర్ల వేతనాల్లో కోతలు విధిస్తున్నట్లు పేర్కొన్న సుజుకి మోటార్ కార్పొరేషన్.. డైరెక్టర్ల మార్పు కూడా జరుగుతోందని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే సంస్థ చైర్మన్, సిఇఒగా కొనసాగుతున్న ఒసాము సుజుకి తన సిఇఒ పదవి నుంచి తప్పుకుంటారని వెల్లడించింది. ఇక ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు ఒసాము హోండా కూడా పదవీ విరమణ తీసుకోనున్నారని తెలిపింది. బుధవారం ఇక్కడ నిర్వహించిన సుజుకి మోటార్ కార్పొరేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ఇక సంస్థకు వచ్చిన చెడ్డపేరు నేపథ్యంలో సంస్థలోని రిప్రజెంటేటివ్ డైరెక్టర్లు, డైరెక్టర్లకు 2015 ఆర్థిక సంవత్సరం బోనస్‌ను పూర్తిగా రద్దు చేశామని, సీనియర్ మేనేజింగ్ ఆఫీసర్లు, మేనేజింగ్ ఆఫీసర్లకు 50 శాతం కోత విధిస్తున్నామని సుజుకి మోటార్ కార్పొరేషన్ తెలిపింది. అంతేగాక ఈ జూలై తర్వాత ఆరు నెలలపాటు చైర్మన్ నెలసరి వేతనంలో 40 శాతం కోత ఉంటుందని, అలాగే అధ్యక్షుడు తొషిహిరో సుజుకి వేతనంలో 30 శాతం కోత ఉంటుందని సంస్థ ప్రకటించింది. వైస్ చైర్మన్ యసుహితో హరయమ వేతనంలోనూ 25 శాతం కోత ఉంటుందని చెప్పింది. మేనేజింగ్ ఆఫీసర్ల వేతనాలను కూడా ఈ ఆరు నెలల్లో 20 శాతం తగ్గించి ఇస్తామని తెలిపింది. జరిగిన తప్పుకు సంస్థాగత బాధ్యత ఉందని గుర్తించే ఈ నిర్ణయాలు తీసుకున్నామని సుజుకి మోటార్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. జపాన్‌లో మినిస్ట్రీ ఆఫ్ ల్యాండ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్‌పోర్ట్ అండ్ టూరిజం (ఎమ్‌ఎల్‌ఐటి) సూచించిన నిబంధనలకు విరుద్ధంగా సుజుకి మోటార్ కార్పొరేషన్ వ్యవహరించిందని తేలినది తెలిసిందే. అయితే ఇతర దేశాల్లో సుజుకి అమ్మిన వాహనాలపై ఈ ప్రభావం లేదు. సుజుకి కూడా భారత్‌కు ఈ విషయాన్ని స్పష్టం చేసింది.