బిజినెస్

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 8: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 10.99 పాయింట్లు పెరిగి 27,020.66 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 6.60 పాయింట్లు అందుకుని 8,273.05 వద్ద నిలిచింది. ఐటి, టెక్నాలజీ, హెల్త్‌కేర్ మినహా మిగతా విద్యుత్, క్యాపిటల్ గూడ్స్, పిఎస్‌యు, ఆటో, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, చమురు, గ్యాస్, మెటల్, ఎఫ్‌ఎమ్‌సిజి, బ్యాంకింగ్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆసియా మార్కెట్లలో జపాన్ సూచీ లాభపడగా, హాంకాంగ్, చైనా సూచీలు నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లలోనూ ప్రధాన సూచీలు నష్టాల్లోనే కదలాడాయి.

వడ్డీరేట్లను తగ్గించిన
గ్రామీణ్ కూట ఫైనాన్షియల్ సర్వీసెస్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 8: ప్రైవేట్‌రంగ సూక్ష్మరుణ సంస్థ గ్రామీణ్ కూట ఫైనాన్షియల్ సర్వీసెస్ వడ్డీరేట్లను తగ్గించింది. విద్య, తాగునీరు, పారిశుద్ధ్య వ్యవస్థలకు కూడా రుణాలు ఇస్తామని ఆ సంస్థ ఎండి ఉదయ్‌కుమార్ తెలిపారు. సామాజిక బాధ్యత నిర్వహణలో భాగంగా వడ్డీరేట్లను 18 శాతానికి తగ్గించామన్నారు. తమ సంస్థకు 334 బ్రాంచిలు ఉన్నాయన్నారు.
తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్‌లో జాబ్ మేళా
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 8: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్.. 250 ఉద్యోగాల నియామకానికి జాబ్ మేళా నిర్వహిస్తోంది. ఈ నెల 10న జరిగే జాబ్ మేళాలో ఎలక్ట్రిషియన్లు, అసిస్టెంట్ ఎలక్ట్రిషియన్లు, ఫిట్టర్లు, అసిస్టెంట్ ఫిట్టర్లు, లైట్ వెహికిల్ డ్రైవర్లు, హెవీ వెహికిల్ డ్రైవర్లు, జనరల్ హెల్పర్లు వంటి ఉద్యోగ నియామకాలు జరుగుతాయని సంస్థ జనరల్ మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఎస్‌ఎస్‌సి సర్ట్ఫికెట్లతోపాటు ఐటిఐ/రెలివెంట్ సర్ట్ఫికెట్లు, ఎక్స్‌పిరియెన్స్ సర్ట్ఫికెట్, రెండు ఫొటోలతో ఐటిఐ మల్లేపల్లి క్యాంపస్, శాంతినగర్‌కు రావాలని మేనేజర్ కోరారు. ఉదయం గం. 9.30ల నుంచి సాయంత్రం గం. 5.00ల వరకు జాబ్ మేళా కొనసాగుతుందన్నారు.

ఎఫ్‌డిఐ నవీకరణ సారాంశం విడుదల
న్యూఢిల్లీ, జూన్ 8: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) విధానాన్ని సరళతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఓ నవీకరించిన సారాంశాన్ని విడుదల చేసింది. అవసరమైన మార్పులను తీసుకొస్తూ, అనవసరమైన వివరణలను ఇందులో తొలగించింది. అయితే విదేశీ పెట్టుబడుల కోసం మల్టీ-బ్రాండ్ రిటైల్ తెరవడంపై మాత్రం గత యుపిఎ హయాంలోని విధానానే్న యథాతథంగా ఉంచింది. మదుపరుల హితార్థం, ‘మేక్ ఇన్ ఇండియా’, వ్యాపార నిర్వహణ సులభతరం కోసం ఈ ఎఫ్‌డిఐ పాలసీ సారాంశాన్ని విడుదల చేశామని పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక శాఖ (డిఐపిపి) తెలిపింది.

‘ఇక ఈ-కామర్స్‌కు గడ్డు రోజులే’
హైదరాబాద్, జూన్ 8: రాబోయే ఒకటి, రెండు సంవత్సరాల్లో భారతీయ ఈ-కామర్స్ సంస్థలు అత్యంత తీవ్రమైన పోటీని ఎదుర్కోబోతున్నాయని, ప్రముఖ సంస్థలతోసహా మరికొన్నైతే నిలకడ లోపించిన ఈ వ్యాపారాన్ని చూసి తప్పుకుంటాయని టెక్ ఇనె్వస్టర్ టివి మోహన్‌దాస్ పాయ్ జోస్యం చెప్పారు. ‘ఈ-టెయిలర్లు ప్రస్తుతం కస్టమర్లకు భారీ రాయితీలతో ఉత్పత్తులను అమ్ముతున్న రోజులు దగ్గరపడ్డాయి. వారిక ఎంతోకాలం పెట్టుబడులు పెట్టలేరు.’ అని ఇన్ఫోసిస్ మాజీ బోర్డు సభ్యుడు, ముఖ్య ఆర్థిక అధికారి, హెచ్‌ఆర్ అధిపతి కూడా అయిన మోహన్‌దాస్ పాయ్ బుధవారం ఇక్కడ పిటిఐతో అన్నారు.

సెంట్రల్ యూనివర్శిటీలో
స్టార్టప్ కంపెనీలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 8: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో స్టార్టప్ కంపెనీలు మొదలయ్యాయి. ద టెక్నాలజీ ఇంక్యుబేషన్ అండ్ డెవలప్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ (టైడ్) పేరిట సెంట్రల్ యూనివర్శిటీ విభాగం మూడు స్టార్టప్ కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. స్టార్టప్ కంపెనీలకు ప్రాథమిక వౌలిక సదుపాయాలను, ఇతర మద్దతును యూనివర్శిటీ అందిస్తుంది. సాంకేతిక సహకారాన్ని సైతం యూనివర్శిటీ ఫ్యాకల్టీ సిబ్బం ది అందిస్తారు. అవసరమైతే స్టార్టప్ కంపెనీల తీరును ఎప్పటికపుడు మూల్యాంకనం చేస్తారు. నియోస్క్రిప్ట్, ఇకె జియో సఫైర్ టెక్నాలజీస్, ఆప్‌కా పెయింటర్ సంస్థలు ముందు కు వచ్చాయి. రానున్న రోజుల్లో మరిన్ని సంస్థలు ఏర్పాటుకు వీలు కల్పిస్తామని సెంట్రల్ యూనివర్శిటీ విసి చెప్పారు.