బిజినెస్

భారత్‌లో అమెజాన్ భారీ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 8: అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. భారత్‌లో 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. భారత ఆన్‌లైన్ షాపింగ్ వేగంగా వృద్ధిని సాధిస్తున్న నేపథ్యంలో ఇక్కడి మార్కెట్‌లో పెద్ద ఎత్తున వాటాను అందుకోవాలని చూస్తోంది అమెజాన్. ఇప్పటికే 2014లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను అమెజాన్ ప్రకటించింది. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా మరో 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెడతామని అమెజాన్ వ్యవస్థాకుడు, సిఇఒ జెఫ్ బెజోస్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఇక్కడ మంగళవారం జరిగిన భారత్-అమెరికా వ్యాపార మండలి (యుఎస్‌ఐబిసి) రౌండ్ టేబుల్ సమావేశంలో బెజోస్ తెలిపారు. ఈ సమావేశంలో మోదీ కూడా పాల్గొన్నారు. ‘్భరత్‌లో ఇప్పటికే మేము 45,000 ఉద్యోగ అవకాశాలను కల్పించాం. దేశ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి మరింతగా పెరుగుతున్నందున మా పెట్టుబడులు, అందుకు అనుగుణంగా ఉద్యోగాలూ పెరుగుతాయి.’ అని బెజోస్ చెప్పారు. 2013లో భారత్‌లోకి అమెజాన్ ప్రవేశించింది. స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ వంటి భారతీయ ఆన్‌లైన్ మార్కెటీర్లతో ఇది గట్టి పోటీనే ఎదుర్కొంటోంది. అయినప్పటికీ భారత్‌లో తమ వ్యాపార విస్తరణే ధ్యేయంగా ముందుకెళ్తోంది. ఇదిలావుంటే ఈ సందర్భంగా యుఎస్‌ఐబిసి గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డును బెజోస్ అందుకున్నారు. సన్ ఫార్మా వ్యవస్థాపకుడు, ఎండి దిలీప్ సంఘ్వీకి కూడా లభించింది. కాగా, అనంతరం బెజోస్ మాట్లాడుతూ ‘మా అమెజాన్‌డాట్‌ఇన్ బృందం ఈపాటికే మేము నిర్దేశించుకున్న ప్రతిష్ఠాత్మక మైలురాళ్లను అధిగమించింది.’ అన్నారు. కాగా, ట్వింటీఫస్ట్ (21) సెంచురీ ఫాక్స్‌కు చెందిన అనుబంధ సంస్థ స్టార్ ఇండియా కూడా రాబోయే మూడేళ్లకుపైగా కాలంలో భారత్‌లో అదనంగా మరో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ‘్భరతీయ మార్కెట్‌లో మేము ఎన్నో అవకాశాలను చూస్తున్నాం. ఇక్కడి మార్కెట్ చాలా విస్తారమైనది. దాని సామర్థ్యం కూడా ఎంతో పెద్దది. కాబట్టి భారత్‌లో పెట్టుబడులు పెడుతున్న భారీ విదేశీ మదుపరులలో మేము కూడా ఉండాలనుకుంటున్నాం. ముఖ్యంగా మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో బలమైన శక్తిగా అవతరించాలనుకుంటున్నాం.’ అని స్టార్ ఇండియా చైర్మన్, సిఇఒ ఉదయ్ శంకర్ అన్నారు. ఇకపోతే యుఎస్‌ఐబిసి చైర్మన్, సిస్కో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కూడా అయిన జాన్ చాంబర్స్ మాట్లాడుతూ గడచిన రెండేళ్లలోపే యుఎస్‌ఐబిసిలో సభ్యత్వం కలిగిన సంస్థల్లో దాదాపు 20 శాతం సంస్థలు భారత్‌లో 28 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఈ పెట్టుబడులు మరింతగా పెరుగుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మరో 45 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు యుఎస్‌ఐబిసిలోని సంస్థలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. భారత్‌లో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న వృద్ధికారక చర్యలు, ప్రవేశపెడుతున్న ఆర్థిక సంస్కరణలపై ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించిన జాన్ చాంబర్స్.. ‘డిజిటల్ ఇండియా’ తదితర ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలను అభినందించారు. మున్ముందు మరిన్ని వృద్ధి దోహద నిర్ణయాలు మోదీ సర్కారు చేపడుతుందన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు. మోదీ విజన్‌తో భారత్ వృద్ధిపథంలో దూసుకెళ్తోందని కితాబిచ్చారు.
chitram...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా యుఎస్‌ఐబిసి గ్లోబల్ లీడర్‌షిప్
అవార్డును అందుకుంటున్న దిలీప్ సంఘ్వీ, జెఫ్ బెజోస్