బిజినెస్

కేంద్ర నిర్ణయం సరైనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10: దేశంలోని లక్షలాది మంది పొగాకు రైతులకు ఊరట కలిగించే విధంగా ఈ రంగంలో విదేశీ పెట్టుబడులను కేంద్రం నిషేధిస్తూ తీసుకున్న చర్యలను అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య స్వాగతించింది. ఈ మేరకు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి మురళి బాబు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. విదేశీ పెట్టుబడుల విధానాల్లో ఉన్న లోపాలను తమకు అనుకూలంగా మలుచుకుని బహుళ జాతి పొగాకు కంపెనీలు దేశీయ పొగాకు రంగాన్ని దెబ్బతీస్తున్నాయని, ఈ విషయాన్ని తాము ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. ముఖ్యంగా దేశంలోకి నకిలీ సిగరెట్ల ప్రవేశం వల్ల పొగాకు రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. దీనివల్ల పొగాకు రైతాంగం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోందన్నారు. నిజానికి భారతీయ చట్టాలకు అనుగుణంగా విదేశీ తయారీ సిగరెట్లు, నకిలీ సిగరెట్లు లేవన్నారు. విదేశీ సిగరెట్ ప్యాకెట్లపైన హెచ్చరికలు ఉండవని ఉన్నా చిన్నగా ఉంటాయని గుర్తుచేశారు. అయతే దేశీయ బ్రాండ్‌లపైన ప్రమాదం, కేన్సర్ వ్యాధి వస్తుందనే హెచ్చరికలు ఉంటాయన్నారు. దీంతో దేశీయ సిగరెట్ల కంటే విదేశీ తయారీ సిగరెట్లు సురక్షితమైనవనే భ్రమలకు వినియోగదారులు లోనవుతున్నారన్నారు. 2010-11 ఆర్థిక సంవత్సరం లో 110 బిలియన్ సిగరెట్లు తయారయ్యేవని, ఇప్పుడు రకరాల నిషేధాలు, ఆంక్షల వల్ల 86 బిలియన్ల సిగరెట్లు మాత్రమే తయారవుతున్నాయన్నారు.

18 శాతం పెరిగిన
ప్రత్యక్ష పన్నుల వసూళ్లు
న్యూఢిల్లీ, జూన్ 10: నికర ప్రత్యక్ష పెట్టుబడుల వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి రెండు నెలలు (ఏప్రిల్-మే) 43,391 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. నిరుడు ఇదే సమయంతో పోల్చితే ఇది 18 శాతం అధికమని రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా శుక్రవారం ట్వీట్ చేశారు. కార్పొరేషన్, ఆదాయ, సంపద పన్నులను ప్రత్యక్ష పన్నులుగా పరిగణిస్తారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 7.78 లక్షల కోట్ల రూపాయలుగా ప్రత్యక్ష పన్నుల వసూళ్లను బడ్జెట్‌లో అంచనా వేసింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబయి, జూన్ 10: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుకున్న ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. వచ్చే వారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యసమీక్ష, ఈ నెల 23న యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వంపై బ్రిటన్‌లో రెఫరెండమ్ మధ్య బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 127.71 పాయింట్లు క్షీణించి 26,635.75 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 33.55 పాయింట్లు పడిపోయి 8,170.05 వద్ద నిలిచింది. రియల్టీ, ఆటో, పిఎస్‌యు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, చమురు, గ్యాస్, టెక్నాలజీ, ఐటి, బ్యాంకింగ్, ఎఫ్‌ఎమ్‌సిజి, క్యాపిటల్ గూడ్స్, మెటల్, హెల్త్‌కేర్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల సూచీ అయితే 1.5 శాతానికిపైగా నష్టపోయింది. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో జపాన్, హాంకాంగ్ సూచీలు నష్టపోగా, చైనా మార్కెట్లకు సెలవు. ఐరోపా మార్కెట్లు కూడా ఆరంభంలో నష్టాల్లోనే కదలాడాయి.

రికార్డు స్థాయిలో
జెఎస్‌డబ్ల్యు స్టీల్ ఉత్పత్తి

మే నెలలో 13.48 లక్షల టన్నులు

న్యూఢిల్లీ, జూన్ 10: సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జెఎస్‌డబ్ల్యు స్టీల్.. గత నెలలో మునుపెన్నడూ లేనివిధంగా అత్యధిక నెలసరి ముడి ఉక్కు ఉత్పత్తిని సాధించింది. మేలో 13.48 లక్షల టన్నుల ముడి ఉక్కు ఉత్పత్తి జరిగినట్లు వెల్లడించింది. నిరుడు మే ఉత్పత్తితో పోల్చితే ఇది 16 శాతం అధికమని, నాడు 11.62 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగిందని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలిపింది. ఇకపోతే గత నెల మేలో పొడవాటి ఇనుప రేకుల ఉత్పత్తి 7 శాతం పెరిగి 9.30 లక్షల టన్నులుగా ఉంది. ఇనుప చువ్వల ఉత్పత్తి 22 శాతం ఎగిసి 2.98 లక్షల టన్నులుగా నమోదైంది. బహుళ వ్యాపార సంస్థ జెఎస్‌డబ్ల్యు గ్రూప్‌నకు చెందిన జెఎస్‌డబ్ల్యు స్టీల్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 18 మిలియన్ టన్నులు.

18 శాతం పెరిగిన
జెఎల్‌ఆర్ విదేశీ అమ్మకాలు

న్యూఢిల్లీ, జూన్ 10: దేశీయ ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ వాహనాల విభాగం జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్‌ఆర్) విదేశీ అమ్మకాలు గత నెలలో 18 శాతం వృద్ధి చెందాయి. మేలో 44,946 యూనిట్లను విక్రయించినట్లు ఓ ప్రకటనలో జెఎల్‌ఆర్ తెలిపింది. చైనాలో 28 శాతం, ఉత్తర అమెరికాలో 8 శాతం, బ్రిటన్‌లో 23 శాతం, ఐరోపాలో 24 శాతం అమ్మకాలు పెరిగాయంది. కాగా, నెలసరి అమ్మకాల్లో ఈ ఏడాది ఆరంభం నుంచి పురోగతి కనిపిస్తోందని, ఇది సరికొత్త రికార్డేనని సంస్థ తెలియజేసింది.