బిజినెస్

టమోటా ధరలు పైపైకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, జూన్ 10: చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌లో టమోటా ధరలు పరుగులు పెడుతున్నాయ. శుక్రవారం టమోటా కిలో ధర 68 రూపాయల నుంచి 73 రూపాయల వరకు పలికింది. బహిరంగ మార్కెట్‌లోనైతే కిలో ధర 80 రూపాయలకు చేరింది. మరోవైపు తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, ఒడిశా, మహారాష్ట్ర, ఢిల్లీ, పుదుచ్చేరి, పాండిచ్చేరి రాష్ట్రాలకు మదనపల్లె మార్కెట్ నుంచి టమోటాలు ఎగుమతి అవుతున్నాయి. ఎక్కువగా తమిళనాడులోని కుంభకోణం మార్కెట్‌కు తరలుతోంది. నిరుడు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కురిసిన వర్షాలకు ప్రస్తుత వేసవికాలంలో సైతం రైతులకు లాభిస్తోంది. నెల రోజులుగా టమోటా ధరలు ఆశాజనకంగా కనిపిస్తుండటంతో రైతన్నల ముఖాల్లో మళ్లీ ఆనందం కనిపిస్తోంది. కాగా, మిగతా ప్రాంతాల్లో పంట దిగుబడి చివరకు వచ్చి, కాయ సైజు తగ్గడంతో మదనపల్లె మార్కెట్ నుంచే ఇతర ప్రాంతాలకు ఎక్కువగా టమోటా ఎగుమతి అవుతోంది. ఇదిలావుంటే శుక్రవారం మార్కెట్‌లో పది కిలోల పెట్టె కనిష్టంగా 680 రూపాయలు, గరిష్ఠంగా 730 రూపాయలు పలికింది.

మదనపల్లె మార్కెట్‌లోకి భారీ స్థాయలో వచ్చిన టమోటాలు

సోలార్ ఇండస్ట్రీస్‌కు
రూ. 443 కోట్ల సింగరేణి కాంట్రాక్టు

న్యూఢిల్లీ, జూన్ 10: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్) నుంచి 443.44 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టును సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా అందుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17)తోపాటు వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18)లోనూ ఈ కాంట్రాక్టు కొనసాగనుండగా, ఈ వ్యవధిలో సింగరేణికి 1,63,911.20 ఎమ్‌టి పేలుడు పదార్థాలను సోలార్ ఇండస్ట్రీస్ సరఫరా చేయనుంది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ తెలిపింది. కాగా, పారిశ్రామిక అవసరాలకు పేలుడు పదార్థాలను తయారుచేసే సోలార్ ఇండస్ట్రీస్ ఈ ఏడాది జనవరి-మార్చిలో 48.22 కోట్ల రూపాయల నికర లాభాన్ని అందుకుంది. నిరుడు ఇదే సమయంలో 40.10 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. నాలుగేళ్ల క్రితం రక్షణ రంగంలోకి ప్రవేశించిన ఈ సంస్థ.. ప్రైవేట్‌రంగంలో దేశంలోనే తొలి హెచ్‌ఎమ్‌ఎక్స్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది.