బిజినెస్

పేమెంట్స్ బ్యాంక్ లోగో కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 10: త్వరలో ప్రారంభించబోయే పేమెంట్స్ బ్యాంక్ లోగో కోసం తపాలా శాఖ అనే్వషణాత్మక పోటీని ప్రారంభించింది. శుక్రవారం మొదలైన ఈ పోటీలో తపాలా శాఖ మెచ్చిన లోగోను అందించినవారికి 50,000 రూపాయల నగదు బహుమతి కూడా లభించనుంది.
జూలై 9 వరకు ఎవరైనా ఓ లోగోను దానికి సరైన ట్యాగ్‌లైన్ (ఉపశీర్షిక)తో కలిపి తమకు పంపించాలని ఓ ప్రకటనలో శుక్రవారం తపాలా శాఖ స్పష్టం చేసింది. ప్రజలు, ఇనిస్టిట్యూషన్లు, ఏజెన్సీలు, సంస్థలు ఇలా దేశంలోని ఎవరైనాసరే నెల రోజుల్లో లోగోను పంపించవచ్చని విజేతకు 50,000 రూపాయల బహుమతి ఇస్తామని తపాలా శాఖ తెలిపింది. తమకు అందిన వాటిలో ప్రముఖ డిజైనర్లు, నిపుణులతో కూడిన ఓ కమిటీ 20 ఉత్తమ లోగో ప్రతిపాదనలను ఎంపిక చేస్తారని, వీటికి మైజిఒవి వెబ్‌సైట్ ద్వారా ఓటింగ్ నిర్వహించి ఓ అత్యుత్తమ లోగోను ఎంపిక చేస్తామని వివరించింది.
కాగా, భారతీయ తపాలా శాఖ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి)ను 800 కోట్ల రూపాయల నిధితో ప్రారంభించేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపినది తెలిసిందే. 2017 సెప్టెంబర్ నాటికి 650 శాఖలను అందుబాటులోకి తేవాలన్నది లక్ష్యం. 2018-19కల్లా దేశవ్యాప్తంగా పేమెంట్స్ బ్యాంక్ సేవలను విస్తరించాలని తపాలా శాఖ భావిస్తోంది.

‘ప్రైవేట్ గోదాములకు
దీటుగా రాష్ట్ర గిడ్డంగులు’

విజయవాడ, జూన్ 10: ఆంధ్రప్రదేశ్‌లో గిడ్డంగుల సామర్థ్యాన్ని పెంచి రైతాంగం పండించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా కృషి చేస్తామని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఎల్‌విఎస్‌ఆర్‌కె ప్రసాద్ అన్నారు. శుక్రవారం విజయవాడ ఐలాపురం కాన్ఫరెన్స్ హాలులో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో క్యాపిటల్ బిల్డింగ్ ప్రోగ్రెస్, అగ్రివేర్ హౌసింగ్ మరియు సైంటిఫిక్ స్టోరేజ్ ప్రాక్టీస్‌పై మూడు రోజులపాటు జరగనున్న వర్క్‌షాపును ఎల్‌విఎస్‌ఆర్‌కె ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రైవేట్ గోడౌన్లకు దీటుగా ప్రభుత్వ గిడ్డంగులను తీర్చిదిద్దటమే తమ లక్ష్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిడ్డంగుల సంస్థలో పనిచేస్తున్న అధికారులు, సాంకేతిక సిబ్బందికి నిల్వ సామర్థ్యం పెంపు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం వంటి పలు అంశాలపై విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం కేంద్రాల్లో సిఎస్‌ఎస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ అగ్రికల్చరల్ మార్కెటింగ్, జయపూర్ సంస్థచే శిక్షణ ఇప్పించేందుకు నిర్ణయించామన్నారు. రెండు సంవత్సరాల కాలంలో మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్‌ల నుండి 6 లక్షల 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని పెంచామన్నారు. పులివెందులలో చీనీ తోటలకు నీరందించి కాపాడామని, ఇటీవల పొందూరులో 5 వేల టన్నుల సామర్థ్యం కలిగిన గిడ్డంగిని కూడా ప్రారంభించామన్నారు. కాగా, నాబార్డు సహకారంతో రూ. 342 కోట్ల రుణంతో 6 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వ సామర్థ్యాన్ని పెంచే విధంగా ప్రణాళిక రూపొందించి ముఖ్యమంత్రి ఆమోదానికి పంపామన్నారు. విశాఖపట్నంలో 12 ఎకరాల స్థలంలో కోల్డ్ స్టోరేజి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. గుంటూరులో మిర్చి నిల్వ చేసేందుకు, భీమవరంలో ఆక్వా ఉత్పత్తులకు అనువుగా కూడా కోల్డ్ స్టోరేజ్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసామన్నారు.

రూ. 710 కోట్ల ఎఫ్‌డిఐకి ఎఫ్‌ఐపిబి ఆమోదం

న్యూఢిల్లీ, జూన్ 10: విదేశీ పెట్టుబడుల ప్రగతి బోర్డు (ఎఫ్‌ఐపిబి).. శుక్రవారం నాలుగు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) ప్రతిపాదనలను ఆమోదించింది. వీటి విలువ దాదాపు 710 కోట్ల రూపాయలు. ఇందులో 480 కోట్ల రూపాయల విలువైన అడ్వాన్స్‌డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ ఎఫ్‌డిఐ ప్రతిపాదన కూడా ఉంది. ఇక కొరోనా రెమెడీస్, మెక్‌మిలన్ పబ్లిషర్స్ ఇంటర్నేషనల్, ఒరాడియన్ హెల్త్‌కేర్ గ్లోబల్ ఎఫ్‌డిఐ ప్రతిపాదనలకూ ఎఫ్‌ఐపిబి ఆమోదముద్ర వేసింది. కాగా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ నేతృత్వంలో జరిగిన ఈ తాజా ఎఫ్‌ఐపిబి సమావేశం.. మొత్తం 14 ఎఫ్‌డిఐ ప్రతిపాదనలను పరిశీలించింది. ఈ సందర్భంగా మూడు ప్రతిపాదనలను తిరస్కరించిన ఎఫ్‌ఐపిబి.. నాలుగింటిని ఆమోదించింది. మరో ఏడు ప్రతిపాదనలపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. 5,000 కోట్ల రూపాయల వరకున్న ఎఫ్‌డిఐకి ఎఫ్‌ఐపిబి అనుమతులు ఇవ్వవచ్చు. అంతకంటే ఎక్కువున్న ఎఫ్‌డిఐని మాత్రం ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ నిర్ణయిస్తుంది. చాలా రంగాల్లో ఆటోమెటిక్ మార్గం ద్వారానే ఎఫ్‌డిఐని అనుమతిస్తుండగా, కొన్ని రంగాల్లో మాత్రమే ఎఫ్‌ఐపిబి ఆమోదంతో ఎఫ్‌డిఐ వస్తోంది.