బిజినెస్

విజయ్ మాల్యా నేరస్థుడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 14: దేశంలో బ్యాంకులకు దాదాపు 9 వేల కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను ఎట్టకేలకు నేరస్థుడిగా ప్రకటించారు. బ్యాంకులకు రుణాల ఎగవేత కేసులో విజయ్ మాల్యాపై మనీ లాండరింగ్ చట్టం కింద జరుపుతున్న ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్ (ఇడి) ఈ విషయమై పిఎంఎల్‌ఎ ప్రత్యేక కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం మంగళవారం ఆయనను నేరస్థుడిగా ప్రకటించింది. ‘ఈ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతించి విజయ్ మాల్యాను నేరస్థుడిగా ప్రకటిస్తున్నాం’ అని ప్రత్యేక న్యాయమూర్తి పిఆర్.్భవ్కే స్పష్టం చేశారు. విజయ్ మాల్యాపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద నాన్-బెయిలబుల్ వారెంట్ సహా అనేక ‘అనేక’ అరెస్టు వారెంట్లు పెండింగ్‌లో ఉన్నందున క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (నేర శిక్షా స్మృతి)లోని 82వ సెక్షన్ ప్రకారం ఆయనను నేరస్థుడిగా ప్రకటించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేయడంతో ప్రత్యేక కోర్టు ఈ చర్య చేపట్టింది. చెక్ బౌన్స్ లాంటి పలు కేసుల్లో విజయ్ మాల్యాపై అనేక అరెస్టు వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయని, అలాగే మనీ లాండరింగ్ కేసులో కూడా ఆయన నిందితుడిగా ఉన్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. ఈ కేసు దర్యాప్తులో సాధించిన పురోగతిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వివరించి, దర్యాప్తులో విజయ్ మాల్యా పాల్గొనేలా చూడాల్సిన అవసరం ఉందని విన్నవించడంతో పిఎంఎల్‌ఎ కోర్టు ఆయనను ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించింది.