బిజినెస్

పురోగతిలో ఏపి విద్యుత్ రంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 14: రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర ప్రదేశ్‌లో విద్యుత్ ఉత్పాదక రంగం పురోగతి సాధించింది. 2015-16 ఆర్ధిక సంవత్సరానికిగాను ఇటు ట్రాన్స్‌కో, జెన్‌కోలు లాభాలను ఆర్జించాయి. నాణ్యమైన కరెంటు ఉత్పత్తి, సరఫరా చేస్తూ విద్యుత్ లోటు లేని రాష్ట్రంగా నిలదొక్కుకున్నట్లు సీనియర్ ఐఏఎస్ అధికారి, ఏపి ట్రాన్స్‌కో చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఏపి జెన్‌కో మేనేజింగ్ డైరెక్టర్ కె విజయానంద్ చెప్పారు. విభజన అనంతరం తెలంగాణా నుంచి ఏపికి 1800 కోట్ల రూపాయలు బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు. మరోవైపు ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా ఏపి విద్యుత్ ప్రధాన శాఖలన్నీ హైదరాబాద్ నుంచి అమరావతికి తరలిరానున్నట్లు చెప్పారు. 2015-16 ఆర్ధిక సంవత్సరానికి ఏపి ట్రాన్స్‌కో, ఏపి జెన్‌కోలు సాధించిన ఫలితాలను ఆయన మంగళవారం విజయవాడలో వివరించారు. ఇక్కడ ఏర్పాటు చేసి విలేఖరుల సమావేశంలో తొలుత ‘మిగులు-వెలుగుల ఏపి’ అనే బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గడిచిన ఏడాదిలో ట్రాన్స్‌కో, జెన్‌కోలు గణనీయమైన ప్రగతి సాధించామన్నారు. 50వేల 195 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేశామన్నారు. 24 గంటల పాటు విద్యుత్ అందిస్తున్న రాష్ట్రంగా, పరిశ్రమలకు నాణ్యమైన కరెంటు ఇస్తూ విద్యుత్ లోటు లేని రాష్ట్రాంగా పురోగతి సాధించామన్నారు. రాష్ట్రంలో వినియోగంలో ఉండే విద్యుత్‌లో 50శాతం ఏపి జెన్‌కో ద్వారానే సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. వాడకం పోగా.. ఇతర రాష్ట్రాలకు సైతం విద్యుత్ ఎగుమతులు కూడా చేస్తున్నట్లు చెప్పారు. ఏపి ట్రాన్స్‌కో 2015-16 ఆర్ధిక సంవత్సరానికి 168కోట్లు లాభాన్ని ఆర్జించినట్లు తెలిపారు. ప్రసారణ పనుల్లో ఆర్జించిన ఆదాయం 1179కోట్లు కాగా, ఆయిన ఖర్చు 1011 కోట్లని, 2015-16లో పెట్టిన మూలధన పెట్టుబడులు 1802 కోట్లుగా పేర్కొన్నారు. ఏపి ట్రాన్స్‌కో గడిచిన ఏడాదిలో 220 కెవి సబ్‌స్టేషన్లు, పది 132కెవి సబ్‌స్టేషన్లు ప్రారంభించిందని, ప్రసారణ నెట్‌వర్క్‌లో 400కెవి లైన్లు 235 సికెఎం, 220 కెవి లైన్లు, 456సికెఎం, 132 కెవి లైన్లు, 327 సికెఎం ప్రారంభించామని చెప్పారు. ఇక ఏపి జెన్‌కో విషయానికొస్తే దేశంలోని ప్రధాన విద్యుత్ ఉత్పాదన కేంద్రాల్లో ఒకటిగా ఉందన్నారు. 2015-16 ఆర్ధిక సంవత్సరంలో 3090మెగావాట్ల విద్యుత్ సామర్ధ్యం అదనంగా చేర్చబడిందన్నారు. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు గడిచిన ఆర్ధిక సంవత్సరానికిగాను 843మెగావాట్ల చేర్చబడిందన్నారు. కృష్ణపట్నం స్టేజి-2 800మెగావాట్లు, హిందుజా యూనిట్ -1,2 1040 మెగావాట్లు, సంపద్రాయేతర విద్యుత్ వనరులైన సౌర విద్యుత్ 435 మెగావాట్లు, పవన విద్యుత్ 400మెగావాట్లు, ఇతర వనరుల ద్వారా 525 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యాలను చేర్చినట్లు చెప్పారు. కడపజిల్లా రాయలసీమ టిపిపి, స్టేజి-4, నాగార్జున సాగర్, టెయిల్‌పాండ్ డ్యామ్‌లు అదనపు సామర్ధ్యం విద్యుత్ ఉత్పాదన కోసం నిర్మాణంలో ఉన్నాయని, విజయవాడలోని డాక్టర్ ఎన్‌టిటిపిఎస్ స్టేజి-5,కృష్ణపట్నం ఎస్‌డిఎస్‌టిపిఎస్, ప్రకాశంజిల్లా వాడరేవు అల్ట్రా మెగాపవర్ ప్రాజెక్టు, పోలవరం జలవిద్యుత్ ప్లాంటు మొత్తం కలిపి 7210 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టులు అభివృద్ది దశలో ఉన్నట్లు చెప్పారు. మొత్తం మీదట లక్ష్య సాధనకోసం విద్యుత్ సంస్థలు కృషి చేస్తున్నాయని, ఇక తెలంగాణా నుంచి రావాల్సిన 1800కోట్ల బకాయిల కోసం ప్రభుత్వం సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు. ఇక విభజన తర్వాత రావాల్సిన ఆస్తులు, ఆర్ధిక పరమైన అంశాలకు సంబంధించి కేటాయింపులు ప్రాధమికంగా జరిగినా దీనిపై కమిటీ తీసుకునే నిర్ణయం ప్రకారం తుది కేటాయింపులు ఉంటాయన్నారు. ఇప్పటికే విజయవాడ గుణదలలోని నిర్మాణం పూర్తి దశలో ఉన్న విద్యుత్ ప్రధాన కార్యాలయానికి సంస్థలు తరలిరానున్నట్లు సిఎండి చెప్పారు. విలేఖరుల సమావేశంలో జెన్‌కో ఫైనాన్స్ డైరెక్టర్ జి.ఆదినారాయణ, ట్రాన్స్‌కో డైరెక్టర్ పి.దినేష్, మెంబర్ సెక్రటరీ ఎ చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ట్రాన్స్‌కో సిఎండి/జెన్‌కో ఎండి విజయానంద్