బిజినెస్

ఉత్పత్తికి అనుగుణంగా నిల్వ సామర్థ్యం పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 14: ఉత్పత్తికి అనుగుణంగా నిల్వసామర్థ్యం పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఎల్‌విఎస్‌ఆర్‌కె ప్రసాద్ వెల్లడించారు. గిడ్డంగుల సంస్థ ఉద్యోగులకు మూడు రోజుల పాటు జరిగే శిక్షణ తరగతులను విశాఖలో మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం 6.1 లక్షల టన్నుల ఉత్పత్తుల నిల్వకు అవసరమైన గిడ్డంగులు అందుబాటులో ఉన్నాయని, మరో 5.5 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యంతో గిడ్డంగులను నిర్మించనున్నట్టు తెలిపారు. రైతుల్లో ఉత్పత్తి సామర్ధ్యం పెరిగే విధంగా ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతోందన్నారు. దీనిలో భాగంగానే నదులను అనుసంధానిస్తూ సాగునీటి వసతి కల్పించేందుకు ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసిందన్నారు. భవిష్యత్‌లో కృష్ణానదిని పెన్నాతో అనుసంధానించేలా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోల్డ్ స్టోరేజ్‌ల సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా నాబార్డు నుంచి రూ.342 కోట్ల సాయంతో ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించామన్నారు. ప్రభుత్వ ఆమోదం లభిస్తే మరో 6 లక్షల టన్నుల నిల్వసామర్థ్యం పెరుగుతుందన్నారు. విశాఖలో 12 ఎకరాల్లో కోల్డ్, డ్రై స్టోరేజ్ గిడ్డంగులు నిర్మించనున్నామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా ఉత్పత్తులు ఎక్కుగా ఉన్నందున ఆక్వా యూనివర్శిటీని ఏర్పాటు చేయడంతో పాటు ఎగుమతులు ప్రోత్సహించేందుకు కోల్డ్ స్టోరేజ్ గిడ్డంగులు నిర్మించనున్నామన్నారు. గుంటూరులో మిర్చి స్టోరేజ్‌కు సంబంధించి 27 ఎకరాల్లో గిడ్డంగులు నిర్మిస్తున్నట్టు ఆయన తెలిపారు. సువిశాల తీర ప్రాంతం కలిగిన నవ్యాంధ్రను ఎగుమతులకు ప్రాధాన్యత ఇస్తూ అందుకు అవసరమైన మేర 13 పోర్టులు, మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలను నిర్మించుకుంటున్నామన్నారు.

టోకు ధరల ద్రవ్యోల్బణం 0.79 శాతానికి చేరిక
భగ్గుమన్న కూరగాయల ధరలు

న్యూఢిల్లీ, జూన్ 14: కూరగాయలధరలు మండిపోవడంతో మే నెలలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 0.79 శాతానికి చేరుకుంది. దీంతో సరఫరాల పరంగా ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించడానికి విధానపరమైన చర్యలు తీసుకోవాలంటూ పారిశ్రామిక వర్గాలు డిమాండ్ చేశాయి. మరో వైపు టోకు, రిటైల్ ద్రవ్యోల్బణాలు రెండూ పెరిగిన నేపథ్యంలో పారిశ్రామిక ఉత్పత్తి దిగజారినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేటును తగ్గించడం జాప్యం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ నెలలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 0.34 శాతం ఉండగా మార్చి నెలలో అది మైనస్ 0.45 శాతం ఉండింది. కాగా, గత ఏడాది మేలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మైనస్ 2.20 శాతంగా ఉండింది. కూరగాయల ధరల్లో ద్రవ్యోల్బణం 12.94 శాతంగా ఉంది. ఏప్రిల్ నెలలో ఇది కేవలం 2.21 శాతమే ఉండింది. మరోవైపు పప్పు్ధన్యాల ద్రవ్యోల్బణం 35.56 శాతంగా ఉంది. కాగా, ఏప్రిల్ నెలలో 4.32 శాతం ఉండిన ఆహార ద్రవ్యోల్బణం మే నెలలో 7.88 శాతానికి పెరిగినట్లు మంగళవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి.
కాగా, పప్పులు, ఆహార సరకులు, తృణధాన్యాలు, గోదుమలు లాంటి నిత్యావసర సరకుల ధరలు పెరిగిపోతున్న దృష్ట్యా విధానకర్తలు సప్లైపరంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అసోచామ్ కార్యదర్శి డిఎస్ రావత్ అన్నారు.అంతర్జాతీయ సరకుల ధరల ఆధారంగా టోకు ధరల ఆదారిత ద్రవ్యోల్బణం కదలికలు ఉంటాయి. ముడిచమురు ధరలు గనుక ఇప్పుడున్న స్థాయిలోనే నిలకడగా ఉన్న పక్షంలో ఈ ఆర్థిక సంవత్సరం టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 3 శాతానికి మించకపోవచ్చునని ఐసిఆర్‌ఏ సీనియర్ ఆర్థికవేత్త అదితి నాయర్ అభిప్రాయ పడ్డారు. కాగా, సోమవారం విడుదలైన రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం తీరులోనే ఈ రోజు విడుదలైన టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం కూడా ఉండడం గమనార్హం. ప్రధానంగా ఆహార సరకుల ధరలు పెరగడంతో మే నెలలోరిటైల్ ద్రవ్యోల్బణం 21 నెలల గరిష్ఠస్థాయి అయిన 5.76 శాతానికి చేరుకున్న విషయం తెలిసిందే. కాగా, ఆర్‌బిఐ తన ద్రవ్య పరపతి విధానాన్ని రూపొందించడంలో సాధారణంగా రిటైల్ ద్రవ్యోల్బణానే్న పరిగణనలోకి తీసుకుంటుంది.