బిజినెస్

దిగజారుతున్న ఇంజనీరింగ్ విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 14: హీరో గ్రూప్ ఆధ్వర్యంలో బిఎంయు ముంజాల్ యూనివర్శిటీని ఏర్పాటు చేసినట్టు వర్శిటీ డీన్ డాక్టర్ అమితావ బాబీ మిత్ర చెప్పారు. మంగళవారం నాడు ఆయన హైదరాబాద్‌లో ఆంధ్రభూమికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్శిటీగా బిఎంయు ముంజాల్ యూనివర్శిటీ ఎదగనుందని చెప్పారు. ప్రపంచంలోనే రెండో అత్యున్నత వర్శిటీగా క్యూఎస్ రేటింగ్‌లో వచ్చిన లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ ఈ యూనివర్శిటీని తీర్చిదిద్దుతోందని అన్నారు. దేశంలో ఇంజనీరింగ్ విద్య దిగజారుతోందని, దానికి మరమ్మతు చేసేందుకు తమ యూనివర్శిటీ సకాలంలో స్పందించిందని అన్నారు. తరగతి గది నుండి క్షేత్రస్థాయికి వెళ్లి ఎప్పటికపుడు కౌశలాలను, నైపుణ్యాలను సముపార్జించుకునేలా ఇంజనీరింగ్ విద్యను తీర్చిదిద్దామని అన్నారు. అమెరికాలో తప్ప దేశంలో ఎక్కడా లేని విధంగా హైబ్రిడ్ లెర్నింగ్‌ను ప్రవేశపెట్టామని, అంటే కొద్దిసేపు తరగతి గదిలో నేర్చుకుని, సమయం దొరికినపుడు ఎక్కడ నుండైనా వర్చ్యువల్ తరగతి గదుల ద్వారా పాఠాలను నేర్చుకోవడం, ఏకకాలంలో శిక్షణ పొందడం తమ యూనివర్శిటీ ప్రత్యేకత అని చెప్పారు. తమ యూనివర్శిటీలో ఇంజనీరింగ్, కామర్స్, మేనేజిమెంట్ కోర్సులను ఆఫర్ చేస్తున్నామని, ఇంజనీరింగ్‌లో సివిల్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నామని, విద్యార్ధులకు నాలుగేళ్లూ పరిశ్రమలతో అనుసంథానం చేసి సాంకేతిక శిక్షణ అందించడం జరుగుతుందని చెప్పారు. ఇంపీరియల్ కాలేజీతో పాటు రాబర్ట్ స్మిత్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, యూనివర్శిటీ ఆఫ్ మేరీలాండ్ తదితర సంస్థలతో కూడా భాగస్వామ్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఐసిటి ఆధారిత క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్, సి ఛాంప్, సి మెయిన్స్, సి సేవా, సి క్రీమ్, సి లాంపస్ సంస్థలను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.