బిజినెస్

అల్ట్రా మెగా సోలార్‌పార్క్‌లో 250 మెగావాట్ల ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూన్ 14: అనంతపురం జిల్లా నంబులపూలకుంటలో ఏర్పాటు చేసిన ఆల్ట్రా మెగా సోలార్ పార్క్‌లో విద్యుదుత్పత్తి అంచెలంచెలుగా సాగుతోంది. నెలక్రితం ప్రారంభించిన విద్యుత్ ఉత్పత్తిలో పురోగతి కనిపిస్తోంది. తొలిపక్షం రోజుల్లో 100 మెగా వాట్లకుపైగా ఉత్పత్తి సాధించగా, మంగళవారం నాటికి అది 250 మెగావాట్లకు చేరింది. నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ సోలార్ పార్క్ ద్వారా 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. అలాగే కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన మరో సోలార్ పార్క్ ద్వారా 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రయోగాత్మకంగా ఈ రెండు జిల్లాలో ఉత్పత్తయ్యే సోలార్ విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటోంది. నంబులపూలకుంటలో 1000 మెగావాట్ల సామర్థ్యంతో ఉత్పత్తి ప్రారంభించేందుకు మరో 14 నెలలు పట్టే అవకాశం ఉంది. మొత్తం 1500 మెగావాట్లకు విస్తరించే క్రమంలో అదనంగా 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి(అన్‌టైడ్ పవర్)కి ఎన్‌టిపిసి చర్యలు తీసుకుంటోంది. కాగా ఇక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్‌ను నిల్వ ఉంచి, సబ్‌స్టేషన్లకు సరఫరా చేయడానికి వీలుగా సోలార్ పార్క్ వద్ద 400 కెవి పవర్‌గ్రిడ్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా 220 కెవి సబ్ స్టేషన్లకు సరఫరా చేస్తారు. విద్యుదుత్పత్తిలో భాగస్వామ్యం వహిస్తున్న టాటాకంపెనీ 100, భెల్ 50, ల్యాంకో 50, మరో కంపెనీ 50 మెగావాట్లు చొప్పున ఇప్పటి వరకు విద్యుత్ ఉత్పత్తి చేశాయి. ఈ ప్రక్రియను నెడ్‌క్యాప్ పర్యవేక్షిస్తోందని నెడ్‌క్యాప్ జిల్లా మేనేజర్ ఎం.కోదండరామమూర్తి తెలిపారు.

అనంతపురం జిల్లా నంబులపూలకుంటలో ఏర్పాటుచేసిన సౌర ఫలకాలు