బిజినెస్

అక్రమ మార్గాల్లో నిధుల సేకరణ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 14: అక్రమ మార్గాల్లో నిధుల సేకరణ పథకాలపై కొరడా ఝళిపించడం ద్వారా మదుపరులనుంచి వసూలు చేసి తిరిగి చెల్లించకుండా ఉన్న వారినుంచి 55,000 ఓట్ల రూపాయలు పైగా సొమ్ములను రాబట్టడానికి మార్కెట్ రెగ్యులేటర్ అయిన సెబి చర్యలు ప్రారంభించింది. అక్రమ మార్గాల్లో వసూలు చేసిన మదుపరుల సొమ్ములను, పెనాల్టీలను వసూలు చేసే అధికారాలను 2013 అక్టోబర్‌లో ప్రభుత్వం సెబికి అప్పగించినప్పటినుంచి ఆ సంస్థ దాదాపు 900 రికవరీ చర్యలు చేపట్టింది. వీటిలో ఇప్పటివరకు 200కు పైగా చర్యలు పూర్తయ్యాయి. ఈ చట్టపరమైన చర్యల్లో చిక్కుకున్న మొత్తం సొమ్ము 55,015 కోట్ల రూపాయలుగా ఉంది. దీనిలో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం రూ. 52,959 కోట్లు కూడా ఉంది. కలెక్టివ్ ఇనె్వస్ట్‌మెంట్ స్కీమ్(సిఐఎస్), డీమ్డ్ పబ్లిక్ ఇష్యూలు సంబంధించిన కేసుల మొత్తం రూ.52,912 కోట్లు కాగా, పెనాల్టీల వసూళ్లకు సంబంధించిన సొమ్ము 47 కోట్లు ఉంది. ఈ సమయంలో రూ.2,500 కోట్లకు పైగా ఆస్తుల జప్తునకు నోటీసులు జారీ చేసిన సెబి ఇప్పటివరకు 207 కేసుల్లో రూ. 250 కోట్లు వసూలు చేసింది.