బిజినెస్

నిలకడగా మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 14: టోకు ధరల ద్రవ్యోల్బణం మే నెలలో పెరగడంతో పాటుగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం, ఐరోపా కూటమినుంచి బ్రిటన్ నిష్క్రమణపై రెఫరెండం లాంటి అంతర్జాతీయ పరిణామాల భయాల కారణంగా మదుపరులు మార్కెట్‌కు దూరంగా ఉండడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఎలాంటి లాభనష్టాలు లేండా నిలకడగా ముగిశాయి. అయితే పెద్ద ప్రాజెక్లు మొండిబకాయిల సమస్య పరిష్కారానికి రిజర్వ్ బ్యాంక్ ఒక పథకాన్ని ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు భారీ లాభాలు సాధించాయి. ఏప్రిల్ నెలలో పారిశ్రామిక ఉత్పత్తి దారుణంగా పడిపోవడంతో గత మూడు సెషన్లలో సెనె్సక్స్ 624 పాయింట్లకు పైగా నష్టపోయిన విషయం తెలిసిందే. కాగా, మంగళవారం ఇంతకు ముందు నష్టపోయిన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సెనె్సక్స్ పెరిగిన ప్రతిసారి మదుపరులు అమ్మకాలకు దిగడంతో సూచీ మళ్లీ నష్టాల్లోకి జారుకోవడం జరిగింది. అయితే పిఎస్‌యు బ్యాంక్ షేర్లు మాత్రం భారీగా పెరిగాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేరు 7.9 శాతం పెరగ్గా, ఎస్‌బిఐ 2.65 శాతం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు 1.9 శాతానికి పైగా పెరిగాయి. దాదాపు సెషన్ అంతా నష్టాల్లో కొనసాగిన సూచీలు చివర్లో రిటైల్ ఇనె్వస్టర్ల కొనుగోళ్ల మద్దతుతో పుంజుకొని సోమవారం స్థాయికి చేరుకున్నాయి. దీంతో బిఎస్‌ఇ సెనె్సక్స్ కేవలం 1.06 పాయింట్లు నష్టపోయి 26,395.71 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్సచేంజి సూచీ నిఫ్టీ సైతం 1.75 పాయింట్లు నష్టపోయి 8108.85 పాయింట్ల వద్ద ముగిసింది. బజాజ్ ఆటో దాదాపు 1 శాతం నష్టపోగా, మారుతీ సుజుకి 0.93 శాతం నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఐరోపా, ఆసియా మార్కెట్లు రెండూ కూడా నష్టాల్లో ముగిశాయి.