బిజినెస్

స్మార్ట్ ప్రాజెక్టులు షురూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 15: స్మార్ట్‌సిటీగా మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) రూపుదిద్దుకోవడమే తరువాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సాయంతో పాటు ఇతర సంస్థ మార్గాల ద్వారా రూ. 1,601 కోట్లతో చేపట్టే ప్రాజెక్టులకు ఈ నెల 26న శ్రీకారం చుట్టనున్నారు.
కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా దేశవ్యాప్తంగా స్మార్ట్‌సిటీల నిర్మాణానికి నడుం బిగించింది. దీనిలో భాగంగా తొలి దశలో 20 నగరాలను ఎంపిక చేయగా, కాకినాడ, తిరుపతితోపాటు విశాఖ నగరం స్థానం దక్కించుకుంది. అప్పటికే అమెరికాతో దేశంలోని మూడు ప్రధాన పట్టణాలను స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేసే ఒప్పందం జరిగిన సంగతి విదితమే. కేంద్రం ఎంపిక చేసిన మూడు పట్టణాల్లో సైతం విశాఖ చోటుదక్కించుకుంది. ఇదే సందర్భంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తొలి విడతగా ఎంపిక చేసిన స్మార్ట్‌సిటీ ప్రయోగంలో కూడా విశాఖ ఎంపిక కావడంతో ముందుగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు యంత్రాంగం సిద్ధం అవుతోంది. ఐదేళ్ల పాటు రూ. 500 కోట్లతో స్మార్ట్‌సిటీలకు కేంద్రం ఆర్థిక సాయం అందిస్తుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటుగా మరో రూ. 500 కోట్లు అందిస్తుంది.
తొలి విడతగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 375 కోట్లను విడుదల చేశాయ కూడా. మిగిలిన మొత్తాన్ని జివిఎంసి స్వయంగా వెచ్చించడమో లేనిపక్షంలో ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా సమకూర్చుకోవడమో జరుగుతుంది. జివిఎంసి పరిధిలోని కరకచెట్టు పోలమాంబ ఆలయం నుంచి కెజిహెచ్ వరకూ సుమారు 1,750 ఎకరాల పరిధిలో స్మార్ట్‌సిటీకి రూపకల్పన చేస్తారు. ఈ ప్రాజెక్టు పనులు ఈ నెల 26 నుంచి విశాఖలో మొదల వుతున్నాయ.
స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుల్లో ప్రధానంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. జివిఎంసి సహా అన్ని విభాగాల సేవలు ఇక్కడ అందుబాటులోకి వస్తాయి. సుమారు రూ. 141 కోట్లతో ఈ ప్రాజెక్టు తొలి దశలో రూపుదిద్దుకోనుంది. దీనితో పాటు హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమం కింద ఎంపిక చేసిన స్మార్ట్‌సిటీ పరిధిలో మురికివాడలు లేకుండా, అర్హులైన అందరికీ ఇళ్లను మంజూరు చేస్తారు. కేంద్రం ప్రకటించిన అమృత్ పథకం కింద రూ. 164 కోట్లతో నిరంతర మంచినీటి సరఫరాను చేపడతారు. స్మార్ట్‌సిటీలో భాగంగా అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థను ఎంపిక చేసిన స్మార్ట్ పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు.
ప్రధానమైన పారిశుద్ధ్య పనుల నిర్వహణ, మురుగునీటి పారుదల, వరదనీటి వ్యవస్థలను పటిష్ఠం చేస్తారు. భవన నిర్మాణ వ్యర్థాలు తిరిగి వినియోగంలోకి తెచ్చే ప్రాజెక్టును పిపిపి విధానంలో చేపడతారు. ఇక ట్రాఫిక్ నియంత్రణ ఇతర చర్యల్లో భాగంగా మల్టీలెవెల్ పార్కింగ్ వ్యవస్థకు రూపకల్పన చేస్తారు. అలాగే ఘన వ్యర్థాల నిర్వహణకు కూడా స్మార్ట్ ప్రాజెక్టులో ప్రాధాన్యత ఉంటుంది.