బిజినెస్

ఉంటుందా?.. ఉండదా?..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి/న్యూఢిల్లీ, జూన్ 22: ఇప్పుడు ప్రపంచం చూపంతా.. ఆ వైపే. యూరోపియన్ యూనియన్ (ఈయు)లో బ్రిటన్ ఉంటుందా? ఉండదా? అన్న అంశంపైనే ప్రపంచ దేశాల ఆలోచనలన్నీ. దీనిపై బ్రిటన్‌లో గురువారం ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) జరుగుతుండగా, ఈయులో బ్రిటన్ సభ్యత్వంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈయులో కొనసాగడం వల్ల తాము నష్టపోతున్నామని ఒక వర్గం వాదిస్తుంటే, ఎన్నో ప్రయోజనాలున్నాయని, ఈయు నుంచి బ్రిటన్ వైదొలిగితే (బ్రెగ్జిట్) నష్టపోతామని మరో వర్గం అంటోంది. ఈయులో ఉండటం వల్ల దేశంలోకి ఇతర సభ్యదేశాల పౌరుల వలసలు పెరిగిపోయాయని, దీనివల్ల స్వదేశీ పౌరులకు నష్టం వాటిల్లుతోందని, వస్తున్నవారిలో ఎలాంటి నైపుణ్యాలు ఉండటం లేదని, వారివల్ల దేశంలో నిరుద్యోగ శాతం పెరుగుతోందని బ్రిటన్‌లోని బ్రెగ్జిట్ అనుకూల వర్గం అంటోంది. బ్రిటన్‌లో ఆదాయ వనరులున్నాయని గుర్తుచేస్తోంది. అయితే ఈయు నుంచి వైదొలిగితే వాణిజ్యపరంగా బ్రిటన్‌కు ఇబ్బందులు తలెత్తుతాయని, చుట్టు ప్రక్కల దేశాలతో సత్సంబంధాలుండవని, ఈయుతో ఆర్థిక, వ్యాపార ఒప్పందాలున్న దేశాలు బ్రిటన్‌కు దూరం కావచ్చని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలో పడేస్తుందని బ్రెగ్జిట్ వ్యతిరేక వర్గం చెబుతోంది. బ్రిటన్ ప్రధాన మంత్రి డేవిడ్ కామరాన్ బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా ఓటేయాలని చెబుతున్నారు. అయితే సొంత పార్టీలోని మెజారిటీ సభ్యులు బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఉండటం కలవరపెడుతోంది. బ్రెగ్జిట్‌పై నిర్వహిస్తున్న సర్వేల్లో సైతం అనుకూల, వ్యతిరేక ఓట్లు దాదాపు సమానంగా నమోదవుతుండటంతో రెఫరెండంపై ఆసక్తి మరింత పెరుగుతోంది.
ఈయు అంటే?..
1958 జనవరి 1న యూరోపియన్ యూనియన్‌కు బీజం పడగా, 1993 నవంబర్ 1న ఏర్పడింది. ఫ్రాన్స్, బెల్జియం, లగ్జెంబర్గ్, ఇటలీ, నెదర్లాండ్స్, జర్మనీలు దీన్ని స్థాపించాయి. ఇందులో 28 సభ్యదేశాలుండగా, ప్రస్తుతం బలమైన ఆర్థిక వ్యవస్థలుగా ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాలున్నాయి. అయితే మొదటి నుంచి ఈయులో అయిష్టంగానే ఉంటున్న బ్రిటన్.. అన్ని విషయాల్లోనూ అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తుండటంతో ఫ్రాన్స్, జర్మనీలు ముందుం డి యూనియన్‌ను నడిపిస్తున్నాయి. ఇకపోతే ఉమ్మడి కరెన్సీ యూరోతో ఈయు దేశాల ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి. వీటన్నిటికీ యూరోపియన్ బ్యాంక్ ఉండగా, ఈ 28 దేశాలన్నీ కూడా ఒక దేశం మాదిరిగానే ఉంటాయి. ఒక దేశం నుంచి మరో దేశంలోకి రాకపోకలు స్వేచ్ఛగా జరుగుతాయి. ఈయు జనాభా 508 మిలియన్లకుపైగా ఉండగా, జిడిపి 16-19 ట్రిలియన్ డాలర్లు.
అంతా అప్రమత్తం
బ్రెగ్జిట్ నేపథ్యంలో ప్రపంచం మొత్తం అప్రమత్తమైంది. ముఖ్యంగా బ్రిటన్‌తో ఆర్థిక, వ్యాపార సంబంధాలు పెట్టుకున్న దేశాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గురువారం జరిగే రెఫరెండంలో ఈయు నుంచి వైదొలగడానికే అత్యధిక బ్రిటనీయలు మద్దతు పలికితే బ్రిటన్‌కు రుణాలిచ్చిన దేశాలు, ఆ దేశంలో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న సంస్థలు లబోదిబోమనాల్సిందే. ఈయు నుంచి బ్రిటన్ వెళ్లిపోతే అది ఈయు సమాఖ్యలో సభ్యదేశం కాదు. ఈయు ఒప్పందాలు దానికి వర్తించవు. బ్రెగ్జిట్‌తో ఈయుకు కూడా నష్టం వాటిల్లుతుంది కాబట్టి, ఆ దేశంతో సంబంధాలున్న ఇతర దేశాలను ఈయు దూరం పెట్టవచ్చు. ఫలితంగా ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న ఈయును వదులుకోవాలా? బ్రిటన్‌ను విడిచిపెట్టాలా? అన్న సందిగ్ధంలో ఇతర దేశాలన్నీ పడటం ఖాయమంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇది ప్రపంచ మార్కెట్‌కు ఇబ్బందే అంటున్నారు. ఇప్పటికే ఈ విషయంపై అమెరికా తీవ్ర ఆందోళనకు కూడా గురవుతోంది.
అన్నిటికీ సిద్ధం..
బ్రెగ్జిట్‌పై రెఫరెండం జరుగుతున్న క్రమంలో అన్ని పరిణామాలనూ భారత్ దగ్గరగా గమనిస్తోంది. ముఖ్యంగా దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే వీలుండటంతో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అప్రమత్తమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కూడా బ్రెగ్జిట్ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని ద్రవ్యపరమైన మద్దతునిస్తామని హామీనిచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందిస్తూ అన్నింటికీ సిద్ధంగా ఉన్నామంది. దేశంలో తగినంతా విదేశీ మారకద్రవ్యం (్ఫరెక్స్ నిల్వలు) ఉందని, బ్రెగ్జిట్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపకుండా చర్యలు చేపట్టామని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ అన్నారు.

చిత్రం.. బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామరాన్