బిజినెస్

‘కింగ్‌ఫిషర్’ రుణాలపై ఎస్‌ఎఫ్‌ఐఒ దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 26: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఇచ్చిన రుణాల వివరాలను బ్యాంకుల నుంచి తీవ్ర మోసాల దర్యాప్తు కార్యాలయం (ఎస్‌ఎఫ్‌ఐఒ) సేకరిస్తోంది. ‘కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఎంతెంత రుణం ఇచ్చారన్న సమగ్ర వివరాలను బ్యాంకుల నుంచి ఎస్‌ఎఫ్‌ఐఒ కోరుతోంది. రుణాల మంజూరు సమయంలో అన్ని మార్గదర్శకాలను బ్యాంకర్లు పాటించారా? లేదా? అన్నది తెలుసుకోవాలనుకుంటోంది.’ అని ఓ బ్యాంకింగ్ అధికారి అన్నారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిఫార్సు మేరకు వైట్ కాలర్ నేరాలను ఎస్‌ఎఫ్‌ఐఒ దర్యాప్తు చేస్తుందన్నది తెలిసిందే. ఈ క్రమంలోనే కార్పొరేట్ వ్యవహారాల మంత్రి కూడా అయిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కింగ్‌ఫిషర్ వ్యవహారాన్ని ఎస్‌ఎఫ్‌ఐఒకు అప్పగించారు. ప్రైవేట్‌రంగ ఎయిర్‌లైన్స్‌లో లగ్జరీ సౌకర్యాలతో విమానయాన సేవలను అందించిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి విమానయాన సేవలకు దూరమైనది తెలిసిందే. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ నాయకత్వంలోని 17 బ్యాంకుల కూటమికి 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయి పడింది. చివరకు ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా ముద్ర వేయించుకుంది. ఈ క్రమంలో కింగ్‌ఫిషర్ తాకట్టు పెట్టిన ఆస్తుల వేలం కూడా జరగగా, మాల్యా దేశం విడిచి లండన్‌కు పారిపోయినదీ తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టుల్లో ఉండగా, మాల్యాను విదేశాల నుంచి భారత్‌కు రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.

వృద్ధిపథంలో ప్రైవేట్ బ్యాంకర్ల వేతనాలు
ముంబయి, జూన్ 26: గత ఆర్థిక సంవత్సరం (2015-16) ప్రైవేట్‌రంగ బ్యాంక్ అధిపతుల వేతనాల్లో భారీగా వృద్ధి కనిపించింది. 31 శాతం వృద్ధితో 9.73 కోట్ల రూపాయల జీతాన్ని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అధిపతి ఆదిత్యా పురి అందుకున్నారు. ఆ తర్వాత యాక్సిస్ బ్యాంక్ చీఫ్ శిఖా శర్మ వేతనం 28 శాతం వృద్ధి చెంది 5.50 కోట్ల రూపాయలకు చేరింది. యెస్ బ్యాంక్ చీఫ్ రానా కపూర్ వేతనం కూడా 20.76 శాతం ఎగిసి 5.67 కోట్ల రూపాయలకు చేరగా, కొటక్ మహీంద్ర బ్యాంక్ అధిపతి ఉదయ్ కొటక్ జీతం 9 శాతానికిపైగా పెరిగి 2.47 కోట్ల రూపాయలను తాకింది. అయితే ఐసిఐసిఐ బ్యాంక్ చీఫ్ చందా కొచ్చర్ వేతనం మాత్రం 22 శాతం తగ్గి 4.79 కోట్ల రూపాయలకు పడిపోయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) అసెట్ క్వాలిటీ రివ్యూతో ఈ మార్పులన్నీ చోటు చేసుకున్నాయి.