బిజినెస్

కెటిపిపి -2 కెటిపిపి నూతన కార్యాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) కొత్తగా కోటి మందిని ఆదాయపు పన్ను (ఐటి) చెల్లించే వారి జాబితాలో చేర్చాలనే బృహత్తర లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఆదాయపు పన్ను శాఖ ఇప్పటి వరకు 27 లక్షలకుపైగా మందిని ఈ జాబితాలోకి తీసుకువచ్చింది.
ఆదాయపు పన్ను శాఖ అధికారిక గణాంకాలను ఉటంకిస్తూ ఆదాయపు పన్ను చెల్లింపుదారుల జాబితాలో ఈ ఆర్థిక సంవత్సరం కొత్తగా చేరిన వారిలో ఎక్కువ మంది గుజరాత్, గోవా, మహారాష్ట్ర వంటి పశ్చిమ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని కేంద్ర ఆర్థిక శాఖలోని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారి జాబితాలో ఇటీవలివరకు కొత్త గా 27 లక్షల మందికిపైగా చేరారని, ఈ ఆర్థిక సంవత్సరం కొత్తగా కోటి మందిని ఆదాయపు పన్ను చెల్లింపు పరిధిలోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ శాఖ ఈ సంవత్సరం మధ్యలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వీరిని గుర్తించడం జరిగిందని ఆ వర్గాలు వివరించాయి. కాగా, కొత్తగా ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చిన వారిలో వ్యక్తులు, సంస్థలు ఉన్నాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం కొత్తగా కోటి మందిని ఆదాయపు పన్ను చెల్లింపు పరిధిలోకి తీసుకురావడమనేది అత్యంత జటిలమైన లక్ష్యమని ఆ వర్గాలు వెల్లడించాయి.
నిర్దేశించిన గడువులోగా కోటి మంది లక్ష్యంలో 60 శాతం నుంచి 70 శాతం వరకు లక్ష్యాన్ని సాధిస్తామని ఆదాయపు పన్ను శాఖ క్షేత్రస్థాయి కార్యాలయాలు ఆర్థిక మంత్రిత్వ శాఖకు తెలిపాయని ఆ వర్గాలు వెల్లడించాయి.
కొత్తగా ఆదాయపు పన్ను చెల్లించే వారి విషయంలో గుజరాత్, గోవా, మహారాష్ట్ర ముందంజలో ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే 2016 మార్చి 31 నాటికి మిగతా రాష్ట్రాల నుంచి కూడా తగినంత మంది ఈ జాబితాలో చేరుతారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు పన్ను చెల్లించాల్సిన ఆదాయం ఉండి కూడా చెల్లించకుండా ఉంటున్న వారిని గుర్తించడానికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు ‘నాన్-ఫైలర్స్ మేనేజ్‌మెంట్’ అనే స్పెషల్ ఎలక్ట్రానిక్ మాడ్యూల్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ మాడ్యూల్ ఆయా వ్యక్తులు, సంస్థల ఆర్థిక తదితర వివరాలను గుర్తిస్తోంది.