బిజినెస్

తెలంగాణలో చైనా ఇనె్వస్ట్‌మెంట్ జోన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 4: తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలను చైనా ప్రతినిధి బృందం సోమవారం పరిశీలించింది. చైనాలోని చెంగ్‌షా, హునన్ ప్రావెన్సీకి చెందిన ప్రతినిధి బృందం తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్‌ను సోమవారం సచివాలయంలో కలిసింది. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రతినిధి బృందానికి అరవింద్ కుమార్ వివరించారు. ఏయే రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయో పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పదిహేను రోజుల్లో సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు అనుమతి ఇస్తున్న తీరును తెలియజేశారు. ఐటి, ఏరో స్పెస్, ఫార్మా, ఎలక్ట్రానిక్, వ్యవసాయ ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపనకు తెలంగాణలో మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు. దీంతో తెలంగాణలో ప్రత్యేకంగా చైనా ఇనె్వస్ట్‌మెంట్ జోన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు బృందం తెలిపిందని అరవింద్ కుమార్ వెల్లడించారు. ఈ జోన్‌లో కేవలం పరిశ్రమలు మాత్రమే కాకుండా, గృహ వసతి, వాణిజ్య జోన్‌లు కూడా ఉంటాయని చెప్పారు. కాగా, చైనా ఇనె్వస్ట్‌మెంట్ జోన్‌కు మెదక్ జిల్లాలో వెయ్యి ఎకరాల భూమి కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. మరోవైపు చెగన్‌షా చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టెటివ్ కాన్ఫరెన్స్ వైస్ చైర్మన్ లియు మింగ్లి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించారు. పరిశ్రమల శాఖ అధికారులు ఇవి నర్సింహ్మారెడ్డి, వి వేణుమాధవ్, ఇతర అధికారులు భేటీలో పాల్గొన్నారు.

నిమ్స్-ఇఎస్‌ఐల ఎంవోయు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 4: నిమ్స్-ఇఎస్‌ఐ ఆసుపత్రుల మధ్య వైద్య సేవల విషయంలో కీలకమైన అవగాహన ఒప్పందం (ఎంవోయు) కుదిరింది. సోమవారం కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె లక్ష్మారెడ్డి సమక్షంలో ఇఎస్‌ఐ ఆసుపత్రి డీన్ శ్రీనివాస్, నిమ్స్ డైరెక్టర్ మనోహర్ ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఇఎస్‌ఐ ఆసుపత్రిలో అత్యాధునికమైన పరికరాలు ఉన్నప్పటికీ నిపుణులైన డాక్టర్ల కొరత ఉండడంతో రోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదు. దీంతో దత్తాత్రేయ చొరవ తీసుకుని లక్ష్మారెడ్డితో చర్చించి ఈ ఎంవోయు కుదుర్చుకోవడంలో ముఖ్య భూమిక పోషించారు. ఈ ఒప్పందంతో ఇకమీదట ఇఎస్‌ఐ ఆసుపత్రిలో నిమ్స్ డాక్టర్లు రోగులకు వైద్య సేవలు అందిస్తారు. ఈ ఒప్పందం వల్ల రెండు ఆసుపత్రులకూ ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.