బిజినెస్

వరుస లాభాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 4: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బ్రెగ్జిట్ అనంతరం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు కోలుకుంటున్న సంకేతాలు, వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు. దీంతో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 133.85 పాయింట్లు పుంజుకుని 27,278.76 వద్ద నిలిచింది. నిరుడు అక్టోబర్ 26 నుంచి గమనిస్తే సెనె్సక్స్‌కు ఇదే గరిష్ఠ స్థాయి. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 42.35 పాయింట్లు పెరిగి 8,370.70 వద్ద స్థిరపడింది. నిరుడు ఆగస్టు 20 తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి. కాగా, రియల్టీ, పిఎస్‌యు, మెటల్, చమురు, గ్యాస్, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్ల విలువ 2.20 శాతం నుంచి 1.26 శాతానికి పెరిగింది. స్మాల్-క్యాప్ సూచీ 1.01 శాతం, మిడ్-క్యాప్ సూచీ 0.58 శాతం చొప్పున లాభపడ్డాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, చైనా, జపాన్ సూచీలు లాభపడ్డాయి. ఐరోపా మార్కెట్లలోనూ బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ సూచీలు పెరిగాయి. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగిన (బ్రెగ్జిట్) నేపథ్యంలో అంతకుముందు వారం భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. గత వారం కోలుకున్నది తెలిసిందే. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 747.20 పాయింట్లు పెరిగితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 239.75 పాయింట్లు ఎగిసింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇందుకు దోహదం చేశాయి. మరోవైపు ఈ ఏడాది చివరికల్లా సెనె్సక్స్ 28,500 స్థాయకి పెరగవచ్చని హెచ్‌ఎస్‌బిసి అంచనా వేసింది.

హైదరాబాద్‌లో స్టార్టప్ ఫెస్టివల్
న్యూఢిల్లీ, జూలై 4: ఈ ఏడాది సెప్టెంబర్‌లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ హైదరాబాద్‌లో ఓ స్టార్టప్ ఫెస్టివల్‌ను నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పారిశ్రామిక విధాన, ప్రగతి శాఖ (డిఐపిపి) విజ్ఞప్తి చేసినట్లు ఓ అధికారి తెలిపారు. దేశంలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో భాగంగానే ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. కాగా, ఈ సందర్భంగా అంకుర సంస్థల (స్టార్టప్)కున్న జాతీయ, అంతర్జాతీయ అవకాశాలను, వాటి వల్ల ఉన్న ప్రయోజనాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు.

రేబిజ్‌టెక్ చేతికి క్విక్‌ఎడ్మిన్
హైదరాబాద్, జూలై 4: హైదరాబాద్‌కు చెందిన ఐటి సేవల సంస్థ రే బిజినెస్ టెక్నాలజీస్ (రేబిజ్‌టెక్).. డిజిటల్ ఎడ్యుకేషన్ ఇఆర్‌పి ప్రోడక్ట్ అయిన క్విక్‌ఎడ్మిన్‌ను కొనుగోలు చేసింది. ఎడ్యుకేషన్ టెక్నాలజీ రంగంలో దీనివల్ల తాము మరింత బలోపేతం కాగలమన్న విశ్వాసాన్ని సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో రేబిజ్‌టెక్ వ్యక్తం చేసింది. భారత్‌తోపాటు తమకు పట్టున్న అమెరికా, ఆస్ట్రేలియా మార్కెట్లలో క్విక్‌ఎడ్మిన్ కొనుగోలు లాభిస్తుందని, తాజా లావాదేవీతో భారతీయ డిజిటల్ ఇఆర్‌పి సంస్థల సామర్థ్యం పెరిగిందని రేబిజ్‌టెక్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ రే అన్నారు.