బిజినెస్

ఇంటికి చేరని ఇసుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 25: మీ ఇంటికి మీ ఇసుక అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఇసుక విధానం ఇప్పటికీ గాడిలో పడకపోగా, మాఫియాకు పుష్కలంగా ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. కొత్త ఇసుక విధానం భళా.. అంటూ అధికారులు, కొందరు మంత్రివర్గ సహచరులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు. వాస్తవ పరిస్థితులు తెలియకపోవడం వల్ల అందులో లోటుపాట్లను సరిచేయలేకపోతున్నారు. కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చి సంవత్సరం అవుతోంది. ఇప్పటికీ సాధారణ ప్రజలు కావల్సిన నాణ్యతతో కూడిన ఇసుకను, అనుకున్న సమయానికి, తక్కువ ధరకు పొందలేకపోతున్నారు. దీంతో నిర్మాణ రంగం శరవేగంగా పరుగులు పెడుతున్న సమయంలో ఇసుక కొరత ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మూడు యూనిట్ల ఇసుక ఆరు వేల రూపాయలకు లభ్యమయ్యేది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఇసుక ఖరీదు 28 వేల రూపాయల వరకూ పెరిగిపోయింది. అలాగే పది టైర్ల లారీ ఇసుక అంటే ఐదున్నర నుంచి ఆరు యూనిట్ల ఇసుక 60 వేల రూపాయలకు చేరుకుంది. దీంతో వెంటనే ప్రభుత్వం స్పందించి డ్వాక్రా సంఘాలకు ఇసుక అమ్మకాల బాధ్యతలను అప్పగించింది. అయతే గాడిలో పడుతుందనుకున్న ఇసుక విక్రయాలు, ఇప్పటికీ పక్కదార్లలోనే ప్రయాణిస్తున్నాయి. విశాఖ నగరంలో భారీ ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇందుకు తగ్గట్టుగా ఇసుక సరఫరా కావడం లేదు. ప్రభుత్వ అధీనంలో ఇసుక సరఫరా చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. రెండు నెలల కిందటి వరకూ ప్రభుత్వ స్టాక్ పాయింట్‌లో ఇసుక కొరత ఏర్పడింది. ఆ తరువాత శ్రీకాకుళం నుంచి ఇబ్బడి ముబ్బడిగా ఇసుక వచ్చి పడింది. కానీ ఇది పూర్తిగా నాసిరకం. మూడు యూనిట్ల ప్రభుత్వ ఇసుక రూ 17, 000 నుంచి రూ 18, 000 పలుకుతోంది. ఇదే ఇసుకను దళారుల నుంచి కొనుగోలు చేస్తే 22వేల రూపాయలకు పైగా చెల్లించుకోవలసి వస్తోంది. ఇసుక కోసం వినియోదారుడు చలానా తీసిన తరువాత ఆ ఇసుక ఎప్పుడు ఇంటికి వస్తుందో తెలియదు. వినియోగదారుడు కోరుకున్న నాణ్యత కలిగిన ఇసుక రావడమే లేదు. దీంతో చాలా మంది భవన యజమానులు తిరిగి దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇసుక కావాలనుకున్న వినియోగదారులు చలానా తీసుకుని, ఆ చలానాను లారీ యజమానికి ఇస్తే.. రెండు, మూడు రోజుల తరువాత ఇసుకను ఇంటికి తీసుకువస్తున్నాడు. భవన యజమాని కోరుకున్న నాణ్యమైన ఇసుక మాత్రం వస్తుంది. దీన్ని అదునుగా తీసుకుని దళారులు బినామీ పేర్లతో చలానాలు తీసుకుని ఆయా రీచ్‌ల నుంచి ఇసుక తీసుకువచ్చి విశాఖలో భారీ ధరకు విక్రయిస్తున్నారు. ఈ విషయమై దళారులను ‘ఆంధ్రభూమి’ సంప్రదించగా, ‘ప్రభుత్వం నాణ్యమైన ఇసుక సరఫరా చేయడం లేదు. వేళకు ఇళ్ళకు పంపించలేకపోతోంది. ఆ ఇబ్బందులేమీ లేకుండా నిర్ణీత సమయానికి, కావల్సిన నాణ్యతతో కూడిన ఇసుకను అందచేస్తున్నాం. ప్రభుత్వ ధర కన్నా మేము అధిక మొత్తాన్ని వసూలు చేయడానికి కారణమేంటంటే, రీచ్‌ల దగ్గర లారీలోకి ఇసుక వేయడానికి మూడు యూనిట్లకు వేయి రూపాయలు వసూలు చేస్తున్నారు. చలానా మొత్తానికి ఇది అదనం. అంతేకాకుండా ఒక లారీ విశాఖ నుంచి ఇసుక కోసం శ్రీకాకుళం లేదా రాజమండ్రి వెళ్లిందంటే, కనీసం రెండు రోజులు అక్కడ పడిగాపులు పడాల్సి వస్తోంది. పైగా రెండు యూనిట్ల ఇసుకను మాత్రమే తీసుకురావాలని నిబంధన విధిస్తున్నారు. దీనివలన కనీసం డీజిల్ డబ్బులు కూడా రావు. వీటన్నింటినీ లెక్క వేసుకుని గృహ యజమానుల నుంచి కొంత ఎక్కువ మొత్తాన్ని వసూలు చేస్తున్నాం.’ అని చెప్పారు. దీన్నిబట్టి చూస్తుంటే ఇసుక విధానం వలన వినియోదారులకు ఇప్పటికీ ఒరిగిందేమీ లేదని అర్థమవుతోంది.