బిజినెస్

మెగా స్పెక్ట్రమ్ వేలం సెప్టెంబర్‌లో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 8: భారీ స్థాయిలో స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ సెప్టెంబర్‌లో మెగా వేలం నిర్వహించే వీలుంది. దీనికి సంబంధించి తుది నిర్ణయం త్వరలో వెలువడనుండగా, ఈ వేలంతో ప్రభుత్వ ఖజానాకు 5.66 లక్షల కోట్ల రూపాయల ఆదాయం రావచ్చని టెలికామ్ శాఖ నూతన మంత్రి మనోజ్ సిన్హా అన్నారు. ‘సెప్టెంబర్‌లో పెద్ద ఎత్తున స్పెక్ట్రమ్ వేలానికి వస్తుందని మేము భావిస్తున్నాం. గత నెల స్పెక్ట్రమ్ వేలం ప్రణాళికను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 2,300 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ వేలం ద్వారానే 64,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా. 2,300 మెగాహెట్జ్‌తోపాటు 2,500 మెగాహెట్జ్, 2,100 మెగాహెట్జ్, 1,800 మెగాహెట్జ్, 900 మెగాహెట్జ్, 800 మెగాహెట్జ్, 700 మెగాహెట్జ్ శ్రేణి తరంగాలను వేలం వేయనున్నారు. ఇక టెలికామ్ రంగంలో వివిధ లెవీలు, సర్వీసుల నుంచి మరో 98,995 కోట్ల రూపాయల రాబడి రావచ్చని అనుకుంటున్నాం.’ అని శుక్రవారం ఇక్కడ సిన్హా తెలిపారు. ఇకపోతే కాల్‌డ్రాప్స్‌పై మాట్లాడుతూ వచ్చే 5-6 నెలల్లో ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని టెలికామ్ శాఖ ఈ దిశగా పనిచేస్తోందని అన్నారు. రాబోయే 15-20 రోజుల్లో దీనిపై సమావేశం నిర్వహించి చర్చలు జరుపుతామని చెప్పారు. కాల్‌డ్రాప్ సమస్య టెలికామ్ వినియోగదారులను చాలా ఇబ్బంది పెడుతోందని, దీనికి పరిష్కారమే తమ తొలి ప్రాధాన్యతని స్పష్టం చేశారు. కాగా, టెలికామ్ కుంభకోణంపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ గతంలో ఎన్ని అక్రమాలు జరిగినా, తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అవినీతి చోటుచేసుకోలేదన్నారు. టెలికామ్ ఆపరేటర్ల నుంచి ప్రతి పైసా వసూలు చేస్తామని స్పష్టం చేశారు. ఆరు ప్రధాన టెలికామ్ సంస్థల ప్రయోజనాలకు మోదీ పెద్దపీట వేస్తున్నారని, ప్రభుత్వ ఆదాయాన్ని ఫణంగా పెడుతున్నారని కాంగ్రెస్ గురువారం ఆరోపించినది తెలిసిందే. ఎయిర్‌టెల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, వొడాఫోన్ తదితర సంస్థలు 2006-07 నుంచి 2009-10 మధ్య దాదాపు 46,000 కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని తక్కువచేసి చూపాయని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయం దూరమైందని, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొన్నది విదితమే. కాగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సైతం కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను తప్పుబట్టారు.