బిజినెస్

బొగ్గు ఉత్పత్తికి తీవ్ర విఘాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, జూలై 10: వరంగల్ జిల్ల్లా భూపాలపల్లి ఓపెన్‌కాస్టులో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో గనిలో బొగ్గు ఉత్పత్తి, మట్టి వెలికితీతకు ఆటంకం ఏర్పడింది. గని ఆవరణలో మొత్తం బురదమయంగా మారడంతో భారీ వాహనాలు ఎక్కడికక్కడే నిలిచి పోయినట్లు తెలిపారు. అంతేకాకుండా మట్టి వెలికితీత పనులపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో సుమారు 40 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగి సంస్థకు సుమారు రూ. 7 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.
కోల్‌బెల్ట్ అతలాకుతలం
గోదావరిఖని: భారీ వర్షాలతో కరీంనగర్ జిల్లా కోల్‌బెల్ట్ పారిశ్రామిక ప్రాంతం అతలాకుతలం అవుతోంది. రామగుండం రీజియన్ ప్రాంతాల్లో రోజుకు 51 వేల టన్నుల బొగ్గును తీయాల్సి ఉండగా వర్షం వలన గత రెండు రోజులుగా ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలిగింది.