బిజినెస్

ద్రవ్యోల్బణం, త్రైమాసిక ఫలితాలే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 10: పారిశ్రామిక ఉత్పత్తి, ద్రవ్యోల్బణం గంకాలు, టిసిఎస్, ఇన్ఫోసిస్‌లాంటి ఐటి దగ్గజాలు ప్రకటించే త్రైమాసిక ఫలితాలు, రుతుపవనాల పురోగతి వచ్చేవారం దేశీయస్టాక్ మార్కెట్ల గతిని నిర్ణయించనున్నాయని నిపుణులు అంటున్నారు. ‘త్రైమాసిక ఫలితాలు, రుతుపవనాల పురోగతి, అంతర్జాతీయ మార్కెట్లలో ధోరణులు ఈ వారం మార్కెట్ సెంట్‌మెంట్‌ను నిర్ణయించనున్నాయి. 2016 జూన్‌తోముగిసే త్రైమాకానికి కార్పొరేట్ ఫలితాల వెల్లడి సీజన్ ప్రారంభం కానుండడంతో మదుపరుల దృష్టి త్రైమాసిక ఫలితాలపైన, కంపెనీలు చేసే వ్యాఖ్యలపైకి మళ్లనున్నాయి’ అని ట్రేడ్‌స్మార్ట్ ఆన్‌లైన్ కంపెనీ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. మేనెలకు సంబంధించి పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు మంగళవారం వెలువడనున్నాయి. అదే రోజు జూన్ నెలకు సంబంధించి వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం వివరాలు కూడా వెలువడనున్నాయి. జూన్ నెలకు సంబందించి టోకు ధరల ఆదారిత ద్రవ్యోల్బణం గురువారం వెలువడనుంది.
‘కంపెనీల త్రైమాసిక ఫలితాల వెల్లడి సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే బడా కంపెనీలు ఫలితాలను ప్రకటించడం ఈ వారంలో ప్రారంభం కానుంది. మరో 4-6 వారాల పాటు కంపెనీలు ప్రకటించే త్రైమాసిక ఫలితాలు మదుపరులకు చాలా ముఖ్యమైన అంశంగా ఉంటుంది’ అని ఈక్విరస్ సెక్యూరిటీస్ ఈక్విటీస్ విభాగం చీఫ్ పంకజ్ శర్మ అభిప్రాయ పడ్డారు. ఈ వారం అందరి దృష్టీ ఈ నెల 12న ప్రకటించే వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం (సిపిఐ), పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు (ఐఐపి), అలాగే 14న ప్రకటించే టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణంపైనే ఉంటుందని డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థ ‘మనీపామ్’ ఎండి, సిఈఓ నిర్దోష్ గౌడ్ అభిప్రాయ పడ్డారు. 2016-17 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాల ప్రకటన గతవారమే ప్రారంభమైందని, అయితే ఈ వారం కొన్ని బడా కంపెనీలు ప్రకటించబోయే త్రైమాసిక ఫలితాలను మార్కెట్ గమనించనుందని, ఈ ఫలితాలకు అనుగుణంగా మూడ్‌ను మార్చుకుంటుందని ఆయన చెప్పారు. ఐటి దిగ్గజాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ఇన్ఫోసిస్‌లు ఈ నెల 14, 15 తేదీల్లో ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. రుతుపవనాల పురోగతి, ప్రపంచ మార్కెట్ల ధోరణులులాంటివి కూడా దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపిస్తాయని రిలయన్స్ సెక్యూరిటీస్ ఒక ప్రకటనలో అభిప్రాయపడింది.