బిజినెస్

ఫోర్బ్స్ జాబితాలో షారూఖ్, అక్షయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జూలై 12: బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ ప్రపంచంలోనే అత్యంత పారితోషికం తీసుకుంటున్న టాప్-100 సెలబ్రిటీల్లో ఒకరుగా నిలిచాడు. కింగ్ ఖాన్‌తోపాటు అక్షయ్ కుమార్ కూడా టాప్- 100లో స్థానం దక్కించుకున్నాడు. ఈ ఏడాదికిగాను వివిధ రంగాల ప్రముఖుల పారితోషికాలకు సంబంధించి తాజాగా విడుదలైన ఫోర్బ్స్ మ్యాగజైన్ జాబితాలో షారూఖ్ ఖాన్ 33 మిలియన్ డాలర్ల సంపాదనతో 86వ స్థానంలో ఉండగా, 31.5 మిలియన్ డాలర్లతో అక్షయ్ కుమార్ 94వ స్థానంలో ఉన్నాడు. ఈ విషయంలో అమెరికన్ గాయని టైలర్ స్విఫ్ట్ 170 మిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉంది. కాగా, ‘విజయవంతమైన చిత్రాల్లో ప్రధాన పాత్ర ల్లో నటిస్తూ ఈ ‘్ఫ్యన్’ (షారూఖ్ ఖాన్ నటించిన చిత్రం) స్టార్ బాలీవుడ్ బాక్సాఫీస్‌ను ఏలుతున్నాడు.’ అని ఫోర్బ్స్ పేర్కొంది. అలాగే చాలా బ్రాండ్లకు ప్రాతినిథ్యం వహిస్తూ సంపాదిస్తున్నట్లు కూడా తెలిపింది. ఇదిలావుంటే నిరుడు 76వ స్థానంలో ఉన్న అక్షయ్ కుమార్.. ఈసారి 94వ స్థానానికి పడిపోయాడు. అయినప్పటికీ మూడు విజయవంతమైన చిత్రాలతో దూసుకెళ్తున్న అక్షయ్.. వివిధ వ్యాపార ప్రకటనల్లోనూ దూకుడు ప్రదర్శిస్తున్నాడని ఫోర్బ్స్ స్పష్టం చేసింది. ఇకపోతే ఇంగ్లీష్-ఐరీష్ బ్యాండ్ వన్ డైరెక్షన్ 110 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉండగా, మూడో స్థానంలో రచయిత జేమ్స్ పీటర్సన్, నాలుగో స్థానంలో రియల్ మాడ్రిడ్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రోనాల్డో ఉన్నాడు. ఈ జాబితాలో హాలీవుడ్ కమెడియన్ కెవిన్ హార్ట్ (6), బ్రిటీష్ సింగర్ అడెలె (9), బాస్కెట్‌బాల్ ఆటగాడు లెబ్రాన్ జేమ్స్ (11), పాప్ స్టార్ మడోన్నా (12), యాక్షన్ స్టార్లు ద్వానే జాన్సన్ (19), జాకీచాన్ (21), రియల్టీ టీవీ షో యాంకర్ కిమ్ కర్దాషియాన్ (43), ఆస్కార్‌ను అందుకున్న నటి జెన్నిఫర్ లారెన్స్ (50), బ్రెజిలియన్ సూపర్ మోడల్ గిసెలె బుంద్‌చెన్ (99) కూడా ఉన్నారు. ఇదిలావుంటే జూన్ 2015 నుంచి జూన్ 2016 మధ్య ఏడాది కాలంలో టాప్-100 సెలబ్రిటీల సంపాదన 5.1 బిలియన్ డాలర్లు (3 లక్షల కోట్ల రూపాయలకుపైగా)గా ఉందని ఫోర్బ్స్ తెలిపింది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌దాకా ఉన్న సినీ తారలు, స్వీడన్ సాకర్ స్టార్లు, అమెరికా బాస్కెట్‌బాల్ ఆటగాళ్లతో ఈ జాబితా తయారైంది. కాగా, ఈసారి టాప్-100లో మూడు వంతు ల్లో ఒక వంతు మంది అమెరికాయేతర సెలబ్రిటీలు. నిరుడు 16 మంది మహిళలకు ఈ జాబితాలో స్థానం దక్కితే, ఈసారి 15 మంది ఉన్నారు.
దాతృత్వ జాబితాలో ఐదుగురు
న్యూఢిల్లీ: ఫోర్బ్స్ దాతృత్వ జాబితాలో ఐదుగురు భారతీయులకు చోటు దక్కింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని 13 దేశాల నుంచి 40 మందితో ఈ జాబితా తయారైంది. ఇందులో సంపర్క్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వినీత్, అనుపమ నాయర్, సెరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఇఒ అడర్ పూనావాలా, పుణెకు చెందిన బిలియనీర్ సైరస్ పూనావాలా కుమారుడు, బైయన్ ఇండియా సిఇఒ అమిత్ చంద్ర, ఆయన భార్య, జయ్ వకీల్ ఫౌండేషన్ సిఇఒ అర్చన చంద్ర ఉన్నారు. వీరంతా తమ సంపాదనలో అధిక భాగం సమాజ సేవకు, ప్రజా సంక్షేమానికి, పేదల అభ్యున్నతికి, అనాథ బాలబాలికల రక్షణకు, విద్యకు, వ్యాధిగ్రస్తుల కోసం ఖర్చు చేస్తున్నారు.