బిజినెస్

పెట్టుబడులతో రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: జార్ఖండ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రఘువరదాస్ మదుపరులకు పిలుపునిచ్చారు. తమ పారిశ్రామిక విధానం సరళీకృతంగా ఉందని ఆయన చెప్పారు. బుధవారం ఇక్కడ జరిగిన జార్ఖండ్ ఇనె్వస్ట్‌మెం ట్ రోడ్‌షో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జార్ఖండ్ ప్రభుత్వంతో ఒరాకిల్, శ్రీ సిమెంట్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. బెంగళూరులో సిస్కో సంస్థ జార్ఖండ్ ప్రభుత్వంతో ఒప్పందం ఖరారు చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని టెక్నాలజీకి కేంద్రంగా చేయాలని ప్రణాళిక ఖరారు చేశామన్నారు. దీని కోసం దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఐటి విద్యను అందిస్తున్నామన్నారు. ఒరాకిల్ సంస్థ అకాడమిని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని, ట్రైన్ ది ట్రైనర్ మోడల్ కింద 50 ఉన్నత సాంకేతిక విద్య సంస్థల సభ్యులకు శిక్షణ ఇప్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఐటి రంగంలో అన్ని వౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, ఇ-గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నట్టు వివరించారు. శ్రీ సిమెంట్ సంస్థ జార్ఖండ్‌లో రెండు ఎంటిఎ గ్రైండింగ్ యూనిట్లను 500 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. స్మార్ట్ సిటీ అభివృద్ధికి ఇక్కడి ఐటి సంస్థల చేయూత తీసుకుంటామన్నారు. ఐటి కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇస్తామని, తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు ఐటి రంగంలో జార్ఖండ్ రాష్ట్రాన్ని హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. 2017లో ఐటి జాతీయ సదస్సును నిర్వహిస్తామని, దేశంలోని 40 శాతం సహజ ఖనిజ సంపద గనులు తమ రాష్ట్రంలో ఉన్నాయని గుర్తుచేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఐటి ఇనె్వస్టర్లు, ప్రతినిధులు హాజరయ్యారు.

జార్ఖండ్ ఇనె్వస్ట్‌మెంట్ రోడ్‌షోలో మాట్లాడుతున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రఘువరదాస్

ఆదోని మార్కెట్‌లో
రికార్డు స్థాయకి పత్తి ధర
క్వింటాల్ రూ. 7,218
ఆదోని, జూలై 20: పత్తి ధర బుధవారం సరికొత్త స్థాయని తాకింది. అమాంతం పైకి ఎగిసి క్వింటాల్ ధర రూ. 7,218కి చేరింది. వ్యాపారులు పోటీపడి మరీ పత్తి కొనుగోలు చేయడంతో ధరలు పరుగులు పెట్టాయ. ఇదీ.. కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పరిస్థితి. బుధవారం ఒక్కరోజే మార్కెట్‌కు 463 క్వింటాళ్ళ పత్తి అమ్మకానికి వచ్చింది. క్వింటాల్ ధర రూ. 4,957తో ప్రారంభమై రూ. 7,218 వరకు వెళ్లింది. మోడల్ ధర రూ. 6,704గా నమోదైందని మార్కెట్ యార్డు చైర్మన్ మదిరే భాస్కర్ రెడ్డి, కార్యదర్శి రామారావు తెలిపారు. రాష్ట్రంలోని ఇతర మార్కెట్‌లతో పోలిస్తే ఆదోని వ్యవసాయ మార్కెట్‌లోనే పత్తి ధర రూ. 7 వేల పైచిలుకు పలికిందన్నారు. గత కొద్ది రోజులుగా పత్తి ధర పెరుగుతూ వస్తోందని, ఇది రైతులకు ఎంతగానో ఉపకరిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర రూ. 7 వేలకుపైగా పలికిందని, తిరిగి మళ్లీ అదే ధర నేడు పలకడం సంతోషకరమని రైతులంటున్నారు.