బిజినెస్

ఎఫ్‌ఐపిబి పరిశీలనకు 12 ప్రతిపాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 24: విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపిబి) పరిశీలనకు 12 విదేశీ పెట్టుబడుల ప్రతిపాదనలు రానున్నాయి. వచ్చే నెల 2న జరిగే సమావేశంలో ఎఫ్‌ఐపిబి ఈ పనె్నండింటిని పరిశీలిస్తుంది. ఫైనాన్షియల్ టైమ్స్, రిక్కిట్ బెన్కిజర్ ఇండియా, హెచ్‌ఎస్‌బిసి సెక్యూరిటీస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్, ఎక్స్‌ఫో ఆసియా పసిఫిక్, ఐఎమ్‌సిడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఫిన్‌కేర్ బిజినెస్ సర్వీసెస్, లౌరస్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర సంస్థల పెట్టుబడుల ప్రతిపాదనలపై ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఎఫ్‌ఐపిబి నిర్ణయం తీసుకోనుంది.

‘నిత్యావసరాలపై స్థానిక పన్నులొద్దు’
న్యూఢిల్లీ, జూలై 24: నిత్యావసర ఆహార వస్తువులపై స్థానిక పన్నులను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. పప్పు్ధన్యాలు, వంటనూనెలు ఇతరత్రా ఆహారోత్పత్తులు ప్రజలకు చౌకగా లభించడానికి రాష్ట్రాలు స్థానిక పన్నులను వాటిపై విధించకూడదని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర వినియోగదారుల సంబంధాలు, ఆహార, ప్రజా పంపిణీ వ్యవస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది. దీనికి సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులకు వినియోగదారుల సంబంధాల కార్యదర్శి హేమ్ పాండే లేఖలు రాసినట్లు తెలిపింది.