బిజినెస్

త్రైమాసిక ఫలితాలపైనే ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 24: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను ప్రముఖ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్ ట్రేడింగ్‌ను ప్రధానంగా ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మారుతి సుజుకి, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఎసిసి, బజాజ్ ఆటో, లార్సెన్ అండ్ టర్బో తదితర సంస్థలు ఈ వారం తమ తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఈ క్రమంలో మదుపరులు తమ పెట్టుబడులపై ఈ ఫలితాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవచ్చని పలువురు మార్కెట్ విశే్లషకులు అంటున్నారు. ఇకపోతే పార్లమెంట్‌లో కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అంశం కూడా మార్కెట్ తీరును శాసిస్తుందని చెబుతున్నారు.
ఇప్పటికే ఈ బిల్లు ఆమోదం కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్న క్రమంలో ఆ బిల్లుకు సంబంధించి ఎలాంటి అనుకూల సంకేతాలు వచ్చినా మార్కెట్లు లాభాల్లో దూసుకుపోవడం ఖాయమనే అభిప్రాయాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అలాగే ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మార్కెట్లు అదే రీతిలో స్పందించవచ్చని పేర్కొంటున్నారు. ఇక వర్షపాతం వివరాలు కూడా మార్కెట్ పోకడను నిర్ణయించవచ్చని అంటున్నారు. అయితే ఈ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ఈ వారంతో ముగియనున్న క్రమంలో మదుపరులు లాభాల స్వీకరణకు దిగవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో ఒడిదుడుకులు తప్పకపోవచ్చనిపిస్తోంది. ఇక ఎప్పటిలాగే అంతర్జాతీయ పరిణామాలు, విదేశీ మార్కెట్ల కదలికలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, విదేశీ మదుపరుల పెట్టుబడులు మార్కెట్లపై ప్రభావం చూపుతాయని మార్కెట్ వర్గాలు వివరిస్తున్నాయి. ‘ఆయా సంస్థలు ప్రకటించే త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు.. మార్కెట్ ట్రేడింగ్‌ను నిర్దేశిస్తాయి. అలాగే వర్షాలు, అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాలు దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయి.’ అని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అన్నారు. ‘దేశవ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. రైతాంగంలో ఆనందం వ్యక్తమవుతోంది. దేశ వృద్ధిరేటులో ప్రధాన పాత్ర పోషించే వ్యవసాయ రంగం లాభాల్లో నడిచే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఇక పార్లమెంట్‌లో కీలక బిల్లులు ఆమోదం కావాల్సి ఉంది. అవి ఆమోదం పొందితే మార్కెట్లు నూతన స్థాయిలను అందుకోవచ్చు.’ అని సామ్కో సెక్యూరిటీస్ సిఇఒ జిమీత్ మోదీ అన్నారు.
‘మార్కెట్ కదలికలు త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ఈ వారంతో ముగుస్తున్నందున సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలూ ఉన్నాయి.’ అని క్యాపిటల్‌వయా గ్లోబల్ రిసెర్చ్ లిమిటెడ్ వ్యవస్థాపక సిఇఒ రోహిత్ గుప్తా అన్నారు. ‘జిఎస్‌టి బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే మార్కెట్లు పరుగులు పెట్టడం ఖాయం. ఇక ప్రముఖ సంస్థల త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మదుపరులను మెప్పిస్తే కూడా సూచీలు లాభాలను సంతరించుకుంటాయి.’ అని ఈక్విటీస్, ఈక్విరస్ సెక్యూరిటీస్ అధిపతి పంకజ్ శర్మ అన్నారు. కాగా, గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ స్వల్పంగా నష్టపోయినది తెలిసిందే.