బిజినెస్

లేబులింగ్ నిబంధనల ప్రక్షాళన అవశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: దేశంలో వినియోగదారుల సంక్షేమం కోసం ఆహార ఉత్పత్తులకు సంబంధించిన లేబులింగ్ నిబంధనలను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతో ఉందని జాతీయ ఆహార భద్రతా, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) ఉద్ఘాటించింది. ప్రచార మాధ్యమాల్లో వస్తున్న ఆకర్షణీయమైన వాణిజ్య ప్రకటనలు వినియోగదారులను మాయ చేస్తున్నాయని, దీంతో వివిధ రకాల ఉత్పత్తులను, ముఖ్యంగా ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు విద్యావంతులు సైతం లేబుళ్లను పరిశీలించడం లేదని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ చైర్మన్ ఆశిష్ బహుగుణ ఆవేదన వ్యక్తం చేశారు. లేబుళ్లను పరిశీలించడం వల్ల ఒనగూడే ప్రయోజనాలపై వినియోగదారులకు సరైన అవగాహన లేకపోవడం వల్లనే ఇలా జరుగుతోందని ఆయన మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వినియోగదారుల దినోత్సవంలో పేర్కొన్నారు. ‘ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించాలంటే లేబుళ్లపై మనం దృష్టి కేంద్రీకరించాలి. ఇందుకోసం లేబులింగ్ నిబంధనలను మార్చాల్సిన అవసరం ఉంది. లేకపోతే అది ఆరోగ్యకరమైన ఆహారమో కాదో వినియోగదారులకు ఎలా తెలుస్తుంది?’ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్‌సిడిఆర్‌సి) అధ్యక్షుడు డికె.జైన్ కూడా ప్రసంగించారు. ఆహార ఉత్పత్తులపై ముద్రిస్తున్న లేబుళ్లు వినియోగదారుల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని, కనుక లేబుళ్లకు సంబంధించిన ‘ఎక్స్‌పైరీ డేట్’, ‘బెస్ట్ బిఫోర్’ వంటి అంశాలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ దృష్టి కేంద్రీకరించాలని ఆయన అన్నారు.