బిజినెస్

ప్రభుత్వరంగ బ్యాంకుల సమ్మె రూ. 15 వేల కోట్ల లావాదేవీలపై ప్రభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 29: ప్రభుత్వరంగ బ్యాంకుల సమ్మెతో శుక్రవారం వేలాది కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐలోకి దాని అనుబంధ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఒక్కరోజు బంద్‌ను నిర్వహించారు. దీని ఫలితంగా ఈ ఒక్కరోజే 12,000 కోట్ల రూపాయల నుంచి 15,000 కోట్ల రూపాయల విలువైన లావాదేవీలు ప్రభావితమైనట్లు పారిశ్రామిక సంఘం అసోచామ్ అంచనా వేసింది. దేశవ్యాప్తంగా బ్యాంకులకు చెందిన 80,000 శాఖలు మూతబడ్డాయి. తొమ్మిది బ్యాంక్ ఉద్యోగుల సంఘమైన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ (యుఎఫ్‌బియు), అధికారుల యూనియన్ల ఆధ్వర్యంలో 8 లక్షల మంది బ్యాంక్ సిబ్బంది ఈ సమ్మెలో పాల్గొన్నారు. దీంతో చెక్కు క్లియరెన్సులు, క్యాష్ డిపాజిట్లు, నగదు ఉపసంహరణలకు అంతరాయం ఏర్పడింది. ‘ప్రభుత్వరంగ బ్యాంకుల లాభాలు ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్నాయి. ప్రైవేట్‌రంగ బ్యాంకులతో పోల్చితే నిరర్థక ఆస్తులు (మొండి బకాయిలు) ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో యుఎఫ్‌బియు నిర్ణయంతో నిలిచిపోయిన బ్యాంక్ కార్యకలాపాలు మరిన్ని నష్టాలకు దారితీసే వీలుంది.’ అని అసోచామ్ ప్రధాన కార్యదర్శి డిఎస్ రావత్ అన్నారు. కాగా, తాజా సమ్మెలో ఎస్‌బిఐసహా అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఉద్యోగులు ఆందోళనలు కూడా చేశారు. మరోవైపు ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐసహా మిగతా అన్ని ప్రైవేట్‌రంగ బ్యాంకులు కూడా శుక్రవారం తమ కార్యకలాపాలను కొనసాగించాయి.

శుక్రవారం బ్యాంకు ఉద్యోగుల ఆందోళన