బిజినెస్

ఫ్లిప్‌కార్ట్‌లో 700 మంది ఉద్యోగుల తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 29: దేశీయ అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ దాదాపు 700 మంది ఉద్యోగులను తీసేస్తోంది. అమెజాన్, స్నాప్‌డీల్ తదితర ఇతర ఈ-కామర్స్ సంస్థల నుంచి ఎదురవుతున్న గట్టి పోటీ నేపథ్యంలో సంస్థాగత వ్యయాన్ని తగ్గించుకునే దిశగా ఫ్లిప్‌కార్ట్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే సుమారు 700 మంది సిబ్బందికి ఉద్వాసన పలకనుంది. సంస్థలో 22,000 మందికిపైగా పనిచేస్తున్నారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో స్నాప్‌డీల్ కూడా దాదాపు 200 మందిని తొలగించాలనే నిర్ణయానికి వచ్చింది.
మైక్రోసాఫ్ట్‌లోనూ..
మరోవైపు మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా ఉద్యోగుల తొలగింపు దిశగా వడవడిగా అడుగులేస్తోంది. 2017 ఆర్థిక సంవత్సరం ఆఖరుకల్లా 4,700 మందిని తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్న మైక్రోసాఫ్ట్.. ఇప్పటికే 1,850 మందిని తీసేసింది. ఇప్పుడు మరో 2,850 మంది భారాన్ని దించుకోనుంది. నోకియా మొబైల్ వ్యాపారాన్ని హస్తగతం చేసుకున్న మైక్రోసాఫ్ట్‌కు మొబైల్ వ్యాపారం అంతగా కలిసి రావడం లేదు. దీంతో నష్టాల నుంచి గట్టేక్కేందుకు వ్యయ నియంత్రణ చర్యలను చేపడుతోంది.
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి, జూలై 29: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 156.76 పాయింట్లు పడిపోయి 28,051.86 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 27.80 పాయింట్లు కోల్పోయి 8,638.50 వద్ద నిలిచింది. బ్యాంక్ ఆఫ్ జపాన్ ఉద్దీపనలు ఆశించిన దానికంటే తక్కువగా ఉండటం మార్కెట్లను నిరాశపరిచింది. ఇక ఆసియా మార్కెట్లలో జపాన్ లాభపడగా, చైనా, హాంకాంగ్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, బ్రిటన్ పెరిగితే, జర్మనీ తగ్గింది.