బిజినెస్

వారెన్ బఫెట్‌ను వెనక్కినెట్టిన బెజోస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జూలై 29: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు, సిఇఒ జెఫ్ బెజోస్.. ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో నిలిచాడు. వారెన్ బఫెట్‌ను వెనక్కినెట్టి 65.3 బిలియన్ డాలర్ల సంపదతో ఫోర్బ్స్ జాబితాలో దూకుడును ప్రదర్శించాడు. బఫెట్ సంపద 64.9 బిలియన్ డాలర్లుండగా, ఆయన నాలుగో స్థానానికి పడిపోయాడు. ఇక 75 బిలియన్ డాలర్లతో బిల్‌గేట్స్ మొదటి స్థానంలో, 67 బిలియన్ డాలర్లతో జరాస్ అమనికో ఒర్టేగా రెండో స్థానంలో ఉన్నారు.

‘టేవా నుంచి ఔషధ కొనుగోళ్లు’

హైదరాబాద్, జూలై 29: డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, సిప్లా, అరబిందో ఫార్మా తదితర 11 సంస్థలు.. టేవా ఫార్మస్యూటికల్స్ నుంచి 79 ప్రస్తుత, భవిష్యత్ ఔషధాలను కొనుగోలు చేసే వీలుంది. 40.5 బిలియన్ డాలర్ల విలువైన టేవా-అల్లెగ్రాన్ ఒప్పందం కోసం అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ నిర్దేశించిన షరతుల్లో భాగంగా ఈ కొనుగోళ్లు జరిగే అవకాశాలున్నాయి. కాగా, అమెరికాలో 8 కొత్త డ్రగ్ అప్లికేషన్ల పోర్ట్ఫోలియో కోసం టేవా, అల్లెగ్రాన్‌తో ఓ ఒప్పం దం కుదుర్చుకున్నామని ఇప్పటికే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తెలిపినది తెలిసిందే.

నాబార్డ్ డైరెక్టర్‌గా పార్థసారథి

హైదరాబాద్, జూలై 29: నాబార్డ్ డైరెక్టర్‌గా వ్యవసాయ శాఖ కార్యదర్శి సి పార్థసారథిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రాంత నాబార్డ్ కార్యాలయ చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్ రాధకృష్ణన్, జనరల్ మేనేజర్ తూలిక పంకజ్, ఆంధ్రప్రదేశ్ నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ సత్యనారాయణ తదితరులు వ్యవసాయ కార్యదర్శి పార్థసారథిని సచివాలయంలో శుక్రవారం కలిసి అభినందనలు తెలిపారు.