బిజినెస్

ఐసిఐసిఐకి మొండి బకాయిల సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 29: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 22.1 శాతం పడిపోయి 2,516 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) తొలి త్రైమాసికంలో 3,232 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. మొండి బకాయిలు అధికంగా పెరగడంతోనే బ్యాంక్ లాభాలు తగ్గినట్లు శుక్రవారం వెల్లడించిన ఆర్థిక ఫలితాల్లో తేటతెల్లమైంది.
వడ్డీరేట్లు మారకపోవచ్చు: ఐసిఆర్‌ఎ
న్యూఢిల్లీ, జూలై 29: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో భాగంగా వచ్చే నెల 9న జరిపే సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచవచ్చని ఐసిఆర్‌ఎ అంచనా వేసింది. రెపో, రివర్స్ రెపోల జోలికి ఆర్‌బిఐ వెళ్లకపోవచ్చని అభిప్రాయపడింది. ఆర్‌బిఐ లక్ష్యానికి మించి గత నెల జూన్‌లో వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 5.8 శాతానికి చేరిందని గుర్తు చేసింది. దీంతో ఈసారి వడ్డీరేట్లు తగ్గకపోవచ్చని పేర్కొంది.