బిజినెస్

దువ్వాడ-విజయవాడ మధ్య రైళ్ల వేగం పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి, డిసెంబర్ 22: రైళ్ల వేగాన్ని పెంచడానికి వీలుగా దువ్వాడ-విజయవాడ రైలు మార్గాన్ని మరింత పటిష్టపరిచామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్త చెప్పారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం దువ్వాడ నుండి రాజమండ్రి వరకు రైల్వే స్టేషన్లు, వివిధ విభాగాల్లో తనిఖీలు నిర్వహించిన అనంతరం రాజమండ్రిలో విలేఖర్లతో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం గంటకు 110 కిలోమీటర్ల వేగంతో నడిచేందుకు వీలుగా రైలు మార్గం ఉందని, దీనిని గంటకు 120 కిలోమీటర్ల వేగంతో నడిచే విధంగా ఏర్పాట్లు జరిగాయన్నారు. దువ్వాడ నుండి రాజమండ్రి వరకు తాను 120 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించానని జిఎం రవీంద్రగుప్త సంతృప్తిని వ్యక్తంచేసారు. వేగం పెరగటం వల్ల ప్రయాణికులు మరింత త్వరగా గమ్యాన్ని చేరుకుంటారన్నారు. ఇంధన పొదుపులో భాగంగా రైల్వే స్టేషన్లలో ఎల్‌ఇడి బల్బులు ఏర్పాటుచేయాలని నిర్ణయించామని, తొలి దశలో అనకాపల్లి, తుని, రాజమండ్రిలో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం వెయ్యి కిలోవాట్ల సౌర విద్యుత్‌ను దక్షిణ మధ్య రైల్వేలో ఉత్పత్తి చేస్తున్నామని, రానున్న రెండేళ్లలో దీనిని 5వేల కిలోవాట్లకు పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కోటిపల్లి-నర్సాపురం రైలు మార్గం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, నిధుల కేటాయింపు జరిగిన వెంటనే నిర్మాణం చేపడతామన్నారు. దువ్వాడ-రాజమండ్రి మధ్య మూడో రైలు మార్గం మంజూరయిందని, ఈ నిర్మాణానికి రూ.3873కోట్లు అవసరమవుతాయని అంచనావేస్తున్నామన్నారు. నీతి ఆయోగ్ ఆమోదం వచ్చిన తరువాత పనులు ప్రారంభమవుతాయని, దీని నిర్మాణానికి ఐదేళ్ల సమయం పడుతుందన్నారు. దువ్వాడ-విజయవాడ మధ్య ప్రస్తుతం కొత్త రైళ్లను నడపలేని పరిస్థితి ఉందని, మూడో రైలు మార్గం నిర్మాణం జరిగితే అదనంగా రైళ్లను నడపడానికి అవకాశం కలుగుతుందన్నారు. కాకినాడ-పిఠాపురం రైలు మార్గం నిర్మాణానికి నిధులు మంజూరయితే పనులు ప్రారంభిస్తామని, కొవ్వూరు-్భద్రాచలం రైలు మార్గం నిర్మాణంపై కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని జిఎం రవీంద్రగుప్త చెప్పారు. ఆయన వెంట విజయవాడ డిఆర్‌ఎం అశోక్‌కుమార్ తదితరులున్నారు.

విలేఖర్లతో మాట్లాడుతున్న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా