బిజినెస్

ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలుకు గడువు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 29: ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలుకు గడువు తేదీని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. మదింపు సంవత్సరం 2016-17కుగాను ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలుకు వచ్చే నెల 5 వరకు సమయం ఇచ్చింది. నిజానికి ఈ నెల 31 వరకే ఆదాయ పన్ను రిటర్స్ దాఖలుకు తుది గడువు. అయితే దీన్ని ఆగస్టు 5 వరకు పొడిగిస్తున్నట్లు శుక్రవారం రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తాజా బ్యాంక్ ఉద్యోగుల సమ్మె, జమ్ముకశ్మీర్‌లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల దృష్ట్యా గడువు తేదిని పొడిగిస్తున్నట్లు అధియా చెప్పారు. కాగా, జమ్ముకశ్మీర్‌లో పన్ను చెల్లింపుదారులు ఆగస్టు 31 వరకు తమ ఆదాయ పన్ను రిటర్స్న్‌ను దాఖలు చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.
డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు
మార్గదర్శకాలు
న్యూఢిల్లీ, జూలై 29: డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కోసం వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం ముసాయిదా మార్గదర్శకాలను రూపొందించింది. 72,000 కోట్ల రూపాయల సామర్థ్యం కలిగిన ఈ పరిశ్రమలో వినియోగదారుల ప్రయోజనాలకు అనుగుణంగా వీటిని తీసుకొచ్చింది. ప్రధాని కార్యాలయానికి ఈ మార్గదర్శకాలను పంపనుంది. కేబినెట్ కార్యదర్శితో సంప్రదింపుల్లో దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారు. కాగా, డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమతో వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ శుక్రవారం చర్చలు జరిపారు.
2015-16లో ప్రపంచవ్యాప్తంగా
9 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
టాటా గ్రూప్ వెల్లడి
ముంబయి, జూలై 29: గత ఆర్థిక సంవత్సరం 2015-16లో ప్రపంచవ్యాప్తంగా టాటా గ్రూప్ 9 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టింది. రెవిన్యూ 103 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈ మేరకు శుక్రవారం ఇక్కడ జరిగిన వార్షిక గ్రూప్ లీడర్‌షిప్ కాన్ఫరెన్స్‌నుద్దేశించి గ్రూప్ అధినేత సైరస్ మిస్ర్తి మాట్లాడుతూ తెలిపారు. కాగా, డొకొమోకు 1.17 బిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించేందుకు టాటా గ్రూప్ ముందుకు రావడం లేదని జపాన్‌కు చెందిన మొబైల్ ఫోన్ సంస్థ ఎన్‌టిటి డొకొమో ఆరోపించింది. మరోవైపు ఈ కేసులో భాగంగా ఢిల్లీ హైకోర్టులో 1.17 బిలియన్ డాలర్లను డిపాజిట్ చేసినట్లు టాటా సన్స్ తెలిపింది.