బిజినెస్

పరిశ్రమల్లో అరకొర భద్రత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 2: విశాఖ జిల్లాలోని వివిధ ప్రమాదకర పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు అంతంత మాత్రంగా ఉన్నట్లు వెల్లడైంది. దాదా పు 17 పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని సేఫ్టీ ఆడిట్‌లో గుర్తించారు. విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతున్న తరుణంలో పారిశ్రామిక ప్రమాదాలపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. తరచూ పరిశ్రమల్లో చోటు చేసుకుంటున్న ప్రమాదాల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టమే కాకుండా ప్రతిష్ఠ కూడా మంట గలుస్తున్నదని గుర్తించి దీనిపై సీరియస్‌గా వ్యవహరిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో విశాఖలోని గాజువాక సమీపంలోని బయోమ్యాక్స్ ఫ్యూయల్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ప్రమాదంలో దాదాపు 50 గంటల పాటు అక్కడి చమురు మంటలను అదుపులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం కష్టపడాల్సి వచ్చింది. ఆ పరిశ్రమకు అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో కొంతకాలం మూసివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని 92 ప్రమాదకర పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయన్న అంశంపై అధ్యయనం చేసేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, ఫ్యాక్టరీస్ ఇన్స్‌పెక్టర్ తదితర అధికారులతో ఏర్పాటు చేసిన బృందాలు ఈ ఏడాది మే 2 నుంచి 29 వరకూ వివిధ పరిశ్రమల్లో తనిఖీలు జరిపాయి. ఈ క్రమంలో 17 పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు నాసిరకంగా ఉన్నట్లు గుర్తించారు. మరో 28 పరిశ్రమల్లో 70 శాతం మాత్రమే భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నట్లు వెల్లడైంది. మిగిలిన పరిశ్రమల్లో 85 శాతం వరకూ పాటిస్తున్నట్లు గుర్తించారు. భద్రతా ప్రమాణాలు పాటించని పరిశ్రమలకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. సేఫ్టీ ఆడిట్ వల్ల లోపాలు తెలియడమే కాకుండా గ్రేడింగ్ ఇచ్చేందుకు అవకాశం లభించిందన్నారు. కాగా, చాలా పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలను నిరోధించేందుకు, మంటలను అదుపు చేసేందుకు తగిన పరికరాలు లేకపోవడం గమనార్హం. 2015-16 మధ్య అగ్ని ప్రమాదాల్లో 43 మంది మరణించగా, గడచిన రెండు సంవత్సరాల్లో పారిశ్రామిక ప్రమాదాల్లో 35 మంది మరణించారు. కాగా, ర్యాపిడ్ రెస్సాన్స్ టీంను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో ప్రమాదం జరిగినప్పుడు అవసరమైన అత్యవసర సామగ్రి, పరికరాలు, వాహనాలు అందుబాటులో ఉంచనున్నారు.

విశాఖలోని బయో-డీజిల్ ప్లాంట్‌లో సంభవించిన అగ్ని ప్రమాదం (ఫైల్ ఫొటో)