బిజినెస్

డిసిఐ టర్నోవర్ లక్ష్యం రూ. 770 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 2: ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని (2016-17)కి సంబంధించి 770 కోట్ల రూపాయల మేర టర్నోవర్‌ను లక్ష్యంగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డిసిఐ) నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో మంగళవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో డిసిఐ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంపై కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్, డిసిఐ సిఎండి రాజీవ్ త్రిపాఠీ సంతకాలు చేశారు.
ఈ ఒప్పందంలో సంస్థ పనితీరు, మదింపు ప్రాతిపదికలు, టర్నోవర్ లక్ష్యం కీలక అంశాలు. షిప్పింగ్ మంత్రిత్వ శాఖ లక్ష్యాలకు అనుగుణంగా అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు వీలుగా ఈ ఒప్పందాలు దోహదపడనున్నాయ. 2014-15 ఆర్థిక సంవత్సరం కంటే గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో మరింత మెరుగైన ఫలితాలను డిసిఐ సాధించింది. మార్కెట్‌లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నిరుడు 676 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించింది. ఆదాయపు పన్ను చెల్లింపు తరువాత 80 కోట్ల రూపాయల లాభాన్ని కూడా ఆర్జించింది. ఇది అంతకుముందు సంవత్సరం కంటే 29 శాతం ఎక్కువ కావడం గమనార్హం. డిసిఐకి ఉన్న డ్రెడ్జర్లకు తాజాగా డిసిఐ మల్టీక్యాట్‌ను చేర్చారు. ఇన్‌ల్యాండ్ డ్రెడ్జింగ్‌ను సుగమం చేసేందుకు వీలుగా ఇన్‌ల్యాండ్ కట్టర్ సెక్షన్ డ్రెడ్జర్ కోనుగోలు చేసేందుకు ఆర్డర్ ఇచ్చింది.
కోల్‌కతా, హల్డియా, కాండ్ల, కొచ్చిన్ పోర్టులకు సంబంధించి డ్రెడ్జింగ్ కాంట్రాక్టులను కొనసాగిస్తుండగా, కాండ్లా, విశాఖపట్నం పోర్టులకు సంబంధించి క్యాపిటల్ డ్రెడ్జింగ్ కాంట్రాక్టులను విజయవంతంగా పూర్తి చేసింది.

ఒప్పంద పత్రాలను మార్చుకుంటున్న దృశ్యం