బిజినెస్

వాణిజ్య వివాదాలపై రాష్ట్రాలతో సంప్రదింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 2: వాణిజ్యం, ఎగుమతులకు సంబంధించిన వివాదాలపై రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు ప్రారంభించినట్టు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రీటా టియోటియా వెల్లడించారు. మంగళవారం ఆస్కిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పరిశ్రమల శాఖ సీనియర్ అధికారులతో రీటా చర్చించారు. రెండు రాష్ట్రాల్లో ఎగుమతులు, వాణిజ్యానికి కల్పించిన సౌకర్యాలు, వౌలిక వసతుల గురించి అధికారులు ఆమెకు వివరించారు. తెలంగాణ నుంచి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవిందకుమార్, కమిషనర్ మానిక్ రాజ్, ఇతర సీనియర్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ నుంచి సీనియర్ అధికారులు వీణా ఈష్, సోలమన్ అరోకియారాజ్, గిరిజా శంకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాగా, తెలంగాణలో రెండు డ్రైపోర్టులు ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని అరవింద్‌కుమార్ కేంద్ర కార్యదర్శిని కోరారు. అలాగే బహుళ ఉత్పత్తుల వాణిజ్యానికి అనువైన ప్రత్యేక ఆర్థిక మండలిని ఏర్పాటు చేయాలని అన్నారు. వరంగల్ టెక్స్‌టైల్ పార్కు, హైదరాబాద్‌లో ఫార్మా సిటీ గురించి కూడా రీటాతో ఆయన చర్చించారు. హైదరాబాద్ ట్రేడ్ సెంటర్ ఏర్పాటు గురించి కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. కాగా, హైదరాబాద్‌లో కంటైనర్స్ డిపో ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర కార్యదర్శి తెలిపారు.