బిజినెస్

‘విధాన స్తబ్దత’ లేకున్నా మందగించిన సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వంటి కొన్ని కీలక బిల్లులకు పార్లమెంట్‌లో మోక్షం లభించకపోవడంతో దేశంలో గత కొద్ది నెలల నుంచి విధాన సంస్కరణల అమలు వేగం తగ్గిందని, ఆర్థిక వ్యవస్థపై ఇది దీర్ఘ కాలం పాటు ప్రతికూల ప్రభావం చూపుతుందని పారిశ్రామిక విభాగం పిహెచ్‌డి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పిహెచ్‌డిసిసిఐ) మంగళవారం స్పష్టం చేసింది. ‘గత రెండు పార్లమెంట్ సమావేశాల్లో ముఖ్యమైన కొన్ని బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో సంస్కరణల ప్రక్రియ మందగించింది. ఈ విషయంలో మరో అభిప్రాయానికి తావేలేదు. ఆర్థిక వ్యవస్థపై ఇది దీర్ఘ కాలం పాటు దుష్ప్రభావం చూపుతుంది. కనుక ప్రభుత్వం దీనిపై పునరాలోచన జరిపి వౌలిక వసతుల రంగం సహా వివిధ రంగాలకు ఊతమివ్వాల్సిన అవసరం ఉంది’ అని పిహెచ్‌డి చాంబర్ నూతన అధ్యక్షుడు మహేష్ గుప్తా పేర్కొన్నారు. అయితే సమర్ధవంతంగా నిర్ణయాలు తీసుకుంటున్న బలమైన ప్రధాన మంత్రి ఉండటంతో ప్రస్తుతానికి దేశం ‘విధానపరమైన స్తబ్దత’ను ఎదుర్కోవడం లేదని ఆయన తెలిపారు. కేవలం శాసనపరంగా చేపట్టవలసిన చర్యలు సజావుగా సాగకపోవడమే ఆందోళన కలిగిస్తోందని, అయితే ఈ పరిస్థితి దీర్ఘ కాలం పాటు కొనసాగుతుందని భావించడం లేదని ఆయన చెప్పారు.
గృహ రుణాల వడ్డీపై
పన్ను మినహాయింపు పెంచాలి
ప్రభుత్వం డిమాండ్‌ను పెంపొందించడంతో పాటు స్వీయ ఆక్రమిత గృహ రుణాలపై చెల్లించే వడ్డీకి ప్రస్తుతం ఇస్తున్న 2 లక్షల రూపాయలుగా ఆదాయ పన్ను మినహాయింపును రూ.5 లక్షలకు పెంచాలని సూచించారు. జిఎస్‌టి బిల్లు పార్లమెంట్‌లో నిలిచిపోవడాన్ని మహేష్ గుప్తా ప్రస్తావిస్తూ, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ బిల్లును వ్యతిరేకిస్తోందని, దీనిని త్వరగా పరిష్కరించుకోవలసిన అవసరం ఉందని అన్నారు. అలాగే ప్రస్తుతం అమలులో ఉన్న కార్మిక చట్టాలు పారిశ్రామిక రంగంపై అనవసర భారాన్ని మోపుతున్నాయని, కనుక వీటిని తక్షణమే రద్దుచేసి సరళమైన నిబంధనలతో సమగ్రమైన ఏకీకృత చట్టాన్ని అమలులోకి తీసుకురావాలని కూడా పిహెచ్‌డి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డిమాండ్ చేసింది.

చిత్రం... న్యూఢిల్లీలో మంగళవారం విజన్-2016 పత్రాన్ని ఆవిష్కరిస్తున్న పిహెచ్‌డి చాంబర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గోపాల్ జివరాజికా, నూతన అధ్యక్షుడు
మహేష్ గుప్తా, వైస్ ప్రెసిడెంట్ అనిల్ ఖైతాన్